శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూడవ రోజైన ఆశ్వయుజ శుద్ధ తదియ బుధవారం నాడు శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

ఇంద్రకీలాద్రి:  సెప్టెంబర్ 27 (ప్రజా అమరావతి);

 శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూడవ రోజైన ఆశ్వయుజ శుద్ధ తదియ బుధవారం నాడు శ్రీ కనకదుర్గమ్మవారు  శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 

 సకల మంత్రాలకి మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించు పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీ దేవి.  తల్లి శిరస్సుయందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రిమూర్తాంశగా  గాయత్రిదేవి వెలుగొందుచున్నది.   సమస్త దేవతా మంత్రాలకీ గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆయా దేవతలకు అన్నాదులు, ప్రసాదాలు నివేదన చేయబడతాయి. గాయత్రీ అమ్మవారిని దర్శించటం వలన ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీ మాతను వేదమాతగా కొలుస్తూ, గాయత్రీ మాతను దర్శించడంవలన సకల మంత్ర సిద్ధి తేజస్సు, జ్ఞానము పొందుతారు.

Comments