ఏపీఐఐసీ ఆన్‌లైన్‌ సేవలకు ఆదరణ : ఏపీఐఐసీ వీసీ, ఎండీ సుబ్రమణ్యం జవ్వాది


*ఏపీఐఐసీ ఆన్‌లైన్‌ సేవలకు  ఆదరణ : ఏపీఐఐసీ వీసీ, ఎండీ సుబ్రమణ్యం జవ్వాది*


*కార్యాలయానికి రాకుండానే అనుమతులు మంజూరు*


*4 నెలల్లో వివిధ అనుమతుల కోసం 389 దరఖాస్తులు*


*అన్ని సేవలూ త్వరలో ఆన్‌లైన్‌లో :  ఏపీఐఐసీ ఎండీ*  


 అమరావతి, సెప్టెంబర్, 08 (ప్రజా అమరావతి): పారిశ్రామిక ప్రతినిధులు ప్రభుత్వ కార్యాలయాలకు రాకుండానే ఒక్క క్లిక్‌తో ఆన్‌లైన్‌ ద్వారానే అన్ని సేవలు అందించేలా ఏపీఐఐసీ వేగంగా అడుగులేస్తోంది. ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా 14 సేవలను అందిస్తుండగా.. త్వరలోనే అన్ని సేవలను అందించేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు ఏపీఐఐసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యం వెల్లడించారు. ఆన్‌లైన్‌ సేవలను ప్రవేశపెట్టిన నాలుగు నెలల్లోనే మంచి స్పందన వస్తోందని, ఇప్పటి వరకు అనుమతుల కోసం 389 దరఖాస్తులు రాగా, నిర్ణీత గడువులోగా 144 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. కొన్ని అనుమతులకు మరింత సమాచారం అవసరం కావడంతో తిరిగి పంపగా,  మిగిలిన దరఖాస్తులు పరిశీలన దశలో ఉన్నట్టు ఎండీ స్పష్టం చేశారు. 


*సేవల విస్తరణ*


 ప్రస్తుతం వెబ్‌ ద్వారా సేవలను అందిస్తున్నామని, ఏపీఐఐసీ సేవల కోసం ఒక మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్టు ఏపీఐఐసీ వీసీ, ఎండీ సుబ్రమణ్యం తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేవారు అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సేవలన్నీ ఆన్‌లైన్‌ ద్వారా అందించాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలకనుగుణంగా సేవలను మరింత విస్తరిస్తున్నట్టు  పేర్కొన్నారు. పరిశ్రమ పేర్లు మార్చుకోవడం, కేటాయింపుల్లో మార్పు, కేటాయింపుల బదిలీ, పునఃకేటాయింపులు, కేటాయింపులను వెనక్కి తీసుకోవడం, లైన్ఆఫ్ యాక్టివిటీ మార్పు, పరిశ్రమకు చెందిన నియోజకవర్గ మార్పు, అడిషనల్ లైన్ యాక్టివిటీ, ప్లాట్ పరిమితుల అనుమతులు, ప్లాట్ డివిజన్, విభజనల మార్పులు, ఐదెకరాల్లోపు సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్, ఐదెకరాలపైన సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్‌ల విజ్ఞప్తులు, కేటాయించిన ప్లాట్‌కు సంబంధించిన ఎన్‌వోసీ(నో అబ్జెక‌్షన్ సర్టిఫికెట్), ప్రాజెక్టుకు అమలుకు నిర్దేశించిన గడువు పెంపు, ముందస్తు చెల్లింపులకు అవసరమైన గడువు పెంపు.. తదితర సేవలను ఆన్‌లైన్‌లో అందిస్తున్నామని, త్వరలోనే మిగిలిన సేవలనూ ఆన్‌లైన్‌ పరిధిలోకి తీసుకురానున్నట్టు ఏపీఐఐసీ ఎండీ వివరించారు. ఎప్పటికప్పుడు దరఖాస్తులు, విజ్ఞప్తులను పరిశీలించి, పర్యవేక్షణ చేసి పారిశ్రామికవేత్తలకు ఏ విధమైనా ఇబ్బంది రాకుండా చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్న  ఏపీఐఐసీ ఉద్యోగులను ఎండీ సుబ్రమణ్యం జవ్వాది ఈ సందర్భంగా అభినందించారు.
Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image