*దసరా మహోత్సవాల ఏర్పాట్ల పరిశీలన:
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ (ప్రజా అమరావతి):
ఈరోజు అనగా ది.08-09-2022 న శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారు దేవస్థానం నందు నిర్వహించు దసరా -2022 మహోత్సవములు ఏర్పాట్లులో భాగంగా దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్ధం ఏర్పాటు చేయుచున్న కేశఖండన, స్నానపు ఘాట్లు, త్రాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్లు, ప్రసాదం ఏర్పాట్లు, వినాయక స్వామి వారి గుడి నుండి క్యూ లైన్లు, అన్నదానం ఏర్పాట్లు, పార్కింగ్ ప్రదేశాలు తదితర ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ఆలయ అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగినది.
ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి వారితో పాటుగా ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్లు శ్రీ కె.వి.ఎస్ కోటేశ్వరరావు గారు, శ్రీమతి లింగం రమాదేవి గారు, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ పి.చంద్రశేఖర్ గారు మరియు ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment