సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు అర్హులైన పత్రి లబ్ధిదారునికి అందచేయడం జరుగుచున్నది


నెల్లూరు (ప్రజా అమరావతి);



పేద ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీ అక్కచెలెమ్మలకు. సాధికారత, ఆర్థిక స్వావలంబన చేకూరుస్తూ, జీవనోపాధి కల్పనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ద్వారా ఏటా రూ.18,750 ల చొప్పున క్రమం తప్పకుండా వరుసగా నాలుగేళ్ల లో మొత్తం 75 వేల రూపాయలు ఆర్ధిక సాయంను అందించడం  జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.


శుక్రవారం " వైఎస్ఆర్ చేయూత " కార్యక్రమం ద్వారా వరుసగా మూడో ఏడాది పేద అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సహాయంగా రాష్ట్రవ్యాప్తంగా 26.39 లక్షల మంది మహిళా లబ్ధిదారులకు   ఒక్కొక్కరికి 18,750/- రూపాయలు చొప్పున 4,949.44 కోట్ల ఆర్థిక సహాయాన్ని చిత్తూరు జిల్లా, కుప్పంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో నేరుగా జమచేశారు.


ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణం నుండి రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ, జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి. ఎన్. చక్రధర్ బాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంగం వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాగులేటి ప్రసన్న,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం సంచార జాతుల  వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్ పర్సన్ శ్రీమతి సయ్యద్ ఆసిఫా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బొందిలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ శ్రీ ఎస్. కిషోర్ సింగ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముదిరాజ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ శ్రీ కె. వెంకట నారాయణ ముదిరాజ్, ఎపి ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్  కార్పొరేషన్ చైర్ పర్సన్ శ్రీమతి  షేక్ సైదాని,  జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి వెంకట నారాయణమ్మ,  బి.సి. కార్పొరేషన్ ఈ డి. శ్రీ బ్రహ్మానంద రెడ్డి,  డి.ఆర్.డి.ఎ, మెప్మా  పిడి లు  శ్రీ సాంబశివారెడ్డి,  శ్రీ రవీంద్ర , వైఎస్ఆర్  చేయూత లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీ ఆనం అరుణమ్మ, జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, జిల్లా లోని 1,23,838 మంది వైఎస్ఆర్  చేయూత లబ్ధిదారులకు సంబంధించి 232.20 కోట్ల రూపాయల మెగా చెక్కును లబ్ధిదారులకు అందచేశారు.


రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల పేద ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీ అక్కచెలెమ్మలకు. సాధికారత, ఆర్థిక స్వావలంబన చేకూరుస్తూ, జీవనోపాధి కల్పనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ద్వారా ఏటా రూ.18,750 ల చొప్పున క్రమం తప్పకుండా వరుసగా నాలుగేళ్ల లో మొత్తం 75 వేల రూపాయలు ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా  మొత్తం మూడు విడతల్లో  14,110.61 కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించడం జరిగిందన్నారు.   జిల్లాలో వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ద్వారా  ఇప్పటికే  రెండు విడతల్లో రూ.18,750 ల చొప్పున ఆర్ధిక సాయం అందచేయడం జరిగిందని, 2020-21 మొదటి సంవత్సరంలో 196 .12 కోట్ల రూపాయలు,  2021-22 రెండో సంవత్సరంలో  216.68 కోట్ల రూపాయలు  అందించడం జరిగిందన్నారు. ఈ రోజు మూడో విడత కింద  జిల్లాలో 1,23,838 మంది వైఎస్ఆర్  చేయూత లబ్ధిదారులకు సంబంధించి 232.20 కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని  అందిస్తున్నట్లు మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి  తెలిపారు.  రాష్ట్రంలోని అన్నీ జిల్లా ల కంటే  మన జిల్లాలో ఈ పధకం కింద   ఎక్కువమంది లబ్ధిదారులు లబ్ధిపొందారని, అందుకు కృషి చేసిన జిల్లా యంత్రాంగానికి ఈ సంధర్భంగా మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు అర్హులైన పత్రి లబ్ధిదారునికి అందచేయడం జరుగుచున్నద


ని మంత్రి అన్నారు. వైఎస్ఆర్  చేయూత లబ్ధిదారులు ప్రభుత్వం అందచేస్తున్న ఆర్ధిక సాయాన్ని సద్వినియోగం చేసుకొని తమ జీవన ప్రమాణాలను మెరుగు పర్చుకోవాలని మంత్రి ఈ సంధర్భంగా లబ్ధిదారులకు సూచించారు. 


జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ మాట్లాడుతూ,  పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు.  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంను  విజయవంతంగా నిర్వహించడంలో   దేశంలోని అన్నీ జిల్లాల్లో  మన  జిల్లా  6వ స్థానంలో  నిలిచిందని,  అందుకు కృషి చేసిన జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు తెలియచేస్తున్నట్లు శ్రీమతి అరుణమ్మ అన్నారు.


1. శ్రీమతి గండవరం సుమలత, భర్త దయాకర్, దామరమడుగు, బుచ్చిరెడ్డిపాలెం మండలం (వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులు):


బుచ్చిరెడ్డిపాలెం మండలం,  దామరమడుగు గ్రామానికి  చెందిన శ్రీమతి గండవరం సుమలత మాట్లాడుతూ, నేను చిల్లర దుకాణాన్ని నడుపుకొనుచున్నానని,  వస్తున్న ఆదాయంతో నేను నా  కుటుంబం సంతోషంగా జీవిస్తున్నామని తెలిపారు. జగనన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుండి     మా కుటుంబం అమ్మ ఒడి  పధకం, వైఎస్ఆర్  చేయూత పధకం  కింద     లబ్ది పొందడం జరిగిందన్నారు. గతంలో వ్యాపారం నిమిత్తం వడ్డీ వ్యాపారుల దగ్గర నుంచి అధిక వడ్డీకి తీసుకొనే వారమని, వచ్చిన లాభం మొత్తం వడ్డీ చెల్లింపుకే సరిపోయేదని చెప్పారు.  వైఎస్ఆర్  చేయూత పధకం  కింద      రాష్ట్ర ప్రభుత్వం  18,750 రూపాయల వంతున  రెండు విడతల్లో ఆర్ధిక సాయాని పొందడం జరిగిందని, ఈ రోజు మూడో విడతకూడా  ఆర్ధిక సాయాన్ని పొందుతున్నానని, ఈ ఆర్ధిక సహాయం వలన కుటుంబం మొత్తం ఆనందంగా జీవిస్తున్నామని ఆమె తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.  


2. శ్రీమతి నెల్లూరు అనిత, భర్త మణి, విగ్నేశ్వరపురం, నెల్లూరు నగరం (వైఎస్ఆర్  చేయూత లబ్ధిదారులు):

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పేదల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ చాలా పథకాలను అందిస్తున్నారని వారికి తమ కుటుంబం ఎల్ల వేళ ల రుణ పడి ఉంటుందని  నెల్లూరు నగరానికి చెందిన శ్రీమతి నెల్లూరు అనిత తన సంతోషాన్ని వ్యక్త పరిచారు. వైఎస్ఆర్ చేయూత  పథకం  ద్వారా అందుతున్న  ఆర్థిక సహాయంతో ఫాల్స్, లైనింగ్ మెటీరీయల్ తో టైలరింగ్  షాప్ పెట్టుకొని  కుటుంబం సంతోషంగా జీవిస్తున్నాం అని, మా కుటుంబానికి టిడ్కో ఇల్లు కూడా మంజూరు కావడం జరిగిందని, ముఖ్యమంత్రి శ్రీ  జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆమె అన్నారు. 


3. శ్రీమతి గోను సుగుణమ్మ, భర్త  శ్రీనివాసులు, చినపడుగుపాడు, కోవూరు మండలం (వైఎస్ఆర్  చేయూత లబ్ధిదారులు):

కోవూరు మండలం, చినపడుగుపాడు  గ్రామానికి చెందిన  శ్రీమతి గోను సుగుణమ్మ  తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తనకు వైఎస్ఆర్  చేయూత పధకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక తోడ్పాటు కల్పించడంతో చిల్లర అంగడి నడుపుకొనుచూ వస్తున్న ఆదాయంతో నేను నా  కుటుంబం సంతోషంగా జీవిస్తున్నామని ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ పథకం వల్లఅప్పుల కోసం బయట వ్యక్తుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందని,   మాలాంటి వాళ్లకు అండగా నిలిచిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 



Comments