ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు


నెల్లూరు సెప్టెంబర్ 23 (ప్రజా అమరావతి);


రాష్ట్ర ముఖ్యమంత్రి వినూత్నంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రజలు నీరాజనాలు  పలుకుతున్నారని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు  శ్రీ కాకాణి గోవర్ధన రెడ్డి అన్నారు. 


శుక్రవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం నేదురుమల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంత్రి కాకాణి నిర్వహించారు. గ్రామంలో అడుగుపెట్టిన మంత్రికి స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మహిళలు హారతులతో అపూర్వ స్వాగతం పలికారు. ఇంటింటికీ వెళ్ళి ప్రభుత్వం నుండి పోందిన లబ్దికి సంబంధించిన పత్రాలను అందజేస్తూ గ్రామస్థులతో మమేకమయ్యారు. 


అనంతరం మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలోని 18 సచివాలయాల పరిధిలో  ఇప్పటివరకు గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించామని, ప్రతి గ్రామంలో కూడా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అందాయని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నార


న్నారు. నేదురుమల్లి గ్రామంలో సుమారు 4 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు పూర్తి చేశామన్నారు. కేవలం మొక్కుబడిగా కాకుండా ఆయా గ్రామాల్లోని చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి గ్రామస్థుల విన్నపాలను  వెంటనే పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. 


ఈ కార్యక్రమంలో ఎంపిడివో నగేష్ కుమారి తహశీల్దారు ప్రసాద్, సర్పంచ్ ఉడతా రమేష్, ఎంపిటీసి పెంచలనాయుడు, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది ,వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. 


Comments