రాష్ట్ర ముఖ్యమంత్రికి రేణిగుంట విమానాశ్రయం లో ఘన స్వాగతం.


 రాష్ట్ర ముఖ్యమంత్రికి రేణిగుంట విమానాశ్రయం లో ఘన స్వాగతం.



తిరుపతి, సెప్టెంబర్ 27 (ప్రజా అమరావతి):  రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు తిరుపతి పట్టణంలోని తాతయ్య గుంట గంగమ్మ తల్లి సందర్శించి దర్శించుకుని అలిపిరి వద్ద ఏర్పాటుచేసిన 10 ఎలక్ట్రిక్ బస్సులను జండా ఊపి ప్రారంభించి అనంతరం తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించి శ్రీ వారి సేవలో పాల్గొని మరుసటి రోజు తిరుమలలో పలు కార్యక్రమాలలో పాల్గొనటానికి  సాయంత్రం 5.15 గం కు రేణిగుంట ఏర్పోర్ట్ కు చేరుకొన్న వీరికి ఘన స్వాగతం లభించింది.


రాష్ట్ర భూగర్భ గనులు, అటవీ, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి కే నారాయణస్వామి, టీటీడి బోర్డు చైర్మన్ వై వి సుబ్బా రెడ్డి, రాజ్య సభ ఎంపి వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి, తిరుపతి, చిత్తూరు, రాజంపేట ఎంపీ లు గురుమూర్తి, రెడ్డప్ప, మిథున్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎంఎల్సీ కళ్యాణ చక్రవర్తి, భరత్, ఎం ఎల్ ఏ లు తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి, పూతలపట్టు, పీలేరు, రాజంపేట, సూళ్లూరుపేట, గూడూరు భూమన కరణాకరరెడ్డి, కోనేటి అదిమూలం, బియ్యపు మధుసూధన్ రెడ్డి, ఎం ఎస్ బాబు, చింతల రామచంద్రారెడ్డి, మేడ మల్లికార్జున, సంజీవయ్య, వరప్రసాద్ తిరుపతి జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి, ఈ ఎం సి క్లస్టర్ సీఈఓ గౌతమి, తిరుపతి, చిత్తూరు ఎస్పీ లు పరమేశ్వర రెడ్డి, నిషాంత్ రెడ్డి, జేసి డి కే బాలాజీ, డిసిసిబి చైర్మన్ రెడ్డమ్మ తదితరులు గౌ ముఖ్య మంత్రిని ఘనంగా రిసీవ్ చేసుకునగా ముఖ్య మంత్రి సాయంత్రం గం. 05.25 లకు తాతయ్య గుంట గంగమ్మ తల్లి దర్శన కార్యక్రమంలో పాల్గొనటానికి బయల్దేరి వెళ్లారు. ముఖ్యమంత్రి గారితో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎంఎల్సి తలశిల రఘురాం ఉన్నారు.


ఈ కార్యక్రమంలో,  ఏర్పోర్ట్ డైరెక్టర్ రాజ్ కిషోర్, సి ఎస్ ఓ రాజశేఖర్ డిప్యూటీ కమాండెంట్ శుక్లా, ఏ ఎస్పీ లు సుప్రజ, కులశేఖర్, ఆర్డీవో శ్రీకాళహస్తి, తిరుపతి రామారావు, కనక నరసరెడ్డి,  డిఎస్పీ లు రామచంద్రయ్య, చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.



Comments