విద్యాలయాలే ఆధునిక దేవాలయాలు...

 *ఎమ్మెల్యే ఆర్కే గారి సొంత నిధులు సుమారు 2 లక్షల వ్యయంతో బాలికలకు 26  సైకిళ్ళు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆర్కే ...* 


*విద్యాలయాలే ఆధునిక దేవాలయాలు...


*

దుగ్గిరాల (ప్రజా అమరావతి);

దుగ్గిరాల మండల పరిధిలోని కంఠం రాజుకొండూరు గ్రామంలో ఈరోజు సాయంత్రం 5 గంటలకు సొంత నిధులు సుమారు 2 లక్షల వ్యయంతో బాలికలకు 26  సైకిళ్ళు అందుచేత.


ముందుగా గురుపూజోత్సవం సందర్భంగా విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి చిత్రపటానికి పూలమాల వేసిన నివాళులర్పించినారు. 


ఇటీవల పెనుమూలి గ్రామంలో పర్యటించిన సమయంలో కంఠంరాజుకొండూరు గ్రామం నుండి కాలినడకన కొందరు బాలికలు వస్తున్నారని మరికొందరు పాఠశాలకు గైర్హాజరవుతున్నారని ప్రధానోపాధ్యాయురాలు ఆర్కే గారికి దృష్టికి తీసుకువచ్చింది దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఆర్కె గారు తన సొంత నగదు రూ 2 లక్షలతో సైకలను కొనుగోలు చేసి బాలికలకు అందజేశారు. 


ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే గారు మాట్లాడుతూ విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని పేదవారికి విద్యను అందించడం కోసం గడిచిన మూడున్నర సంవత్సరాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 58 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. 


పేదరికంలో ఉండి విద్యను కొనుగోలు చేయలేని వారికి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకువచ్చి లక్షల మంది విద్యార్థుల్లో వెలుగులు నింపారని తెలిపారు.


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్నట్లు విద్య ప్రాథమిక హక్కుగా కులమతాలకు అతీతంగా ప్రతి పేదవాడికి విద్యను అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందన్నారు. విద్యాలయాలే ఆధునిక దేవాలయాలని ఆ దిశగా పయనిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత కొనియాడిన తక్కువేనన్నారు.


నాడు నేడు పథకం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పాఠశాలలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్ది నిష్ణాతులైన ఉపాధ్యాయులచే విద్యను అందిస్తుందని, విద్యారంగానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరు అభినందించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్కే గారు సొంత నిధులు సుమారు రూ. 2 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన 26 సైకిళ్లను బాలికలకు అందజేశారు.


ఈ సందర్భంగా విద్యార్థినీలు వారి తల్లిదండ్రులు ఆర్కే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments