*'ఏపీఈడీబీ' సీఈవోగా బాధ్యతలను తిరిగి పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ కి అప్పగించిన సుబ్రమణ్యం జవ్వాది*
*డిప్యుటేషన్ ముగియడంతో మాతృశాఖకు బదిలీ అయిన మాజీ ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది*
అమరావతి, సెప్టెంబర్, 29 (ప్రజా అమరావతి); పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ ఏపీఈడీబీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. గురువారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో మాజీ ఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది ఆయనకు తిరిగి ఆ బాధ్యతలు అప్పగించారు. మూడేళ్లుగా పరిశ్రమల శాఖ డైరెక్టర్, ఏపీఐఐసీ వీసీ,ఎండీ, ఏపీ ఈడీబీ సీఈవో బాధ్యతలు నిర్వర్తించిన సుబ్రమణ్యం జవ్వాదిని ఈ సందర్భంగా కరికాల ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన కూడా పాల్గొన్నారు.అనంతరం ఏపీఈడీబీ ప్రతినిధులంతా వచ్చి సుబ్రమణ్యం జవ్వాదిని కలిశారు. ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది సారధ్యంలో పని చేయడం గుర్తుండిపోతుందన్నారు. ఏపీఈడీబీ ప్రతినిధుల బృందం
తరపున ఆయనకి గురుతుగా చిరు జ్ఙాపికను అందజేశారు. శాలువాతో సన్మానించారు. డిప్యూటేషన్ ముగియడంతో సుబ్రమణ్యం జవ్వాదిని మాతృశాఖకు బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం మార్గదర్శకాలిచ్చింది.
addComments
Post a Comment