నాడు – నేడు పనులు వేగవంతం గావించాలి. జిల్లా కలక్టర్ డా.ఎ.మల్లిఖార్జున

 

నాడు – నేడు పనులు వేగవంతం గావించాలి.

జిల్లా కలక్టర్ డా.ఎ.మల్లిఖార్జున


విశాఖపట్నం, సెప్టెంబరు 5 (ప్రజా అమరావతి): నాడు – నేడు ద్వారా చేపట్టిన పనులను వేగవంతం చేయాలని అధికారులను జిల్లా కలక్టర్ ఆదేశించారు.   సోమవారం సాయంత్రం  జిల్లా కలక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో నాడు – నేడు ద్వారా చేపట్టిన వివిధ పనుల పురోగతిపై జాయింట్ కలక్టర్ కె.ఎస్.విశ్వనాధన్ తో కలసి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలక్టర్ మాట్లాడుతూ మంజూరైన  స్కూల్ బిల్డింగ్ పనులను  వేగవంతం చేయాలని  సంబంధిత అధికారులను ఆదేశించారు. వై.ఎస్.ఆర్. పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలలో ఆలసత్వం వహిస్తే కఠిన చర్యలు చేపడతామన్నారు.  అదే విధంగా కొత్తగా మంజూరైన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలను  వేగవంతం చేయాలని రోడ్లు , భవనాల శాఖ  అధికారులను ఆదేశించారు. అంగన్ వాడీ బిల్డంగ్ ల మరమ్మత్తులు, నూతన భవనాల నిర్మాణాలు నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని పంచాయితీ శాఖ అధికారులను  ఆదేశించారు. జగనన్న స్వచ్చ సంకల్పం, వై.ఎస్.ఆర్. జల కళ మరియు జలజీవన్ మిషన్  అమలు తీరు గురించి సంబంధిత అధికారులను  కలక్టర్ అడిగి తెలుసుకున్నారు.  గ్రామీణ గృహ నిర్మాణాల వివరాలను గృహ నిర్మాణాల శాఖ  ప్రాజెక్టు డైరక్టర్ శ్రీనివాస్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా  అక్టోబరు 31 నాటికి ఏ లబ్దిదారుని గృహ నిర్మాణం  బేస్మెంట్ లెవెల్ కన్నా తక్కువ ఉండరాదని,  అందుకు అనుగుణంగా సొంతంగా గృహాలు నిర్మించుకున్న లబ్దిదారులతో  పనులు త్వరితగతిన పూర్తి చేయించాలని  జిల్లా కలక్టర్ ఆదేశించారు.  అదే విదంగా డిశంబరు 20 నాటికి లబ్దిదారుల గృహ నిర్మాణాలు పూర్తి కావాలని  అందుకు ప్రతి నెల టార్గెట్ నిర్ణయించుకొని పని చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో  డి.ఆర్.డి.ఎ. ప్రాజెక్టు డైరక్టర్ శోభారాణి, డ్వామా, జి.వి.ఎం .సి. మరియు సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు. 


Comments