*"జోరు వానలో సైతం ఆళ్ల నానికి జన నీరాజనాలు"*
*-17వరోజు గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ఏలూరు కార్పొరేషన్ 48వ డివిజన్లో 2వ రోజు పర్యటించిన మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు శాసన సభ్యులు ఆళ్ల నాని*
*- నగర వైఎస్సార్ సిపి మహిళా అధ్యక్షురాలు, స్థానిక కార్పొరేటర్ నున్న స్వాతి కిషోర్ దంపతుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం*
*- ఆకట్టుకున్న ముస్లిం చిన్నారుల ఆత్మీయ స్వాగతం*
*◆ జోరువానలో సైతం జన నీరాజనాల మధ్య సాగిన ఆళ్ల నాని 17వ రోజు గడప గడపకు కార్యక్రమం.*
*- ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పధకాల అమలు తీరును ప్రతి గడపకు వెళ్లి స్వయంగా పరిశీలించిన మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు శాసన సభ్యులు ఆళ్ల నాని.*
*- సంక్షేమ పాలనపై ప్రతి గడపలో సంతృప్తి వ్యక్తం చేసిన లబ్దిదారులు*
ఏలూరు (ప్రజా అమరావతి): గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో 17వరోజు పాదయాత్రలో భాగంగా మంగళవారం ఏలూరు కార్పొరేషన్ 48వ డివిజన్ పరిధిలోని తంగేళ్ల మూడి లో. మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు శాసన సభ్యులు ఆళ్ల నాని వరుసగా 2వరోజు పర్యటించారు.
తంగేళ్లమూడిలోని స్థానిక పాత పోస్టాఫీస్ వద్ద నుంచి 17వరోజు పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నగర వైఎస్సార్ సిపి మహిళా అధ్యక్షురాలు, స్థానిక 48వ డివిజన్ కార్పొరేటర్ నున్న స్వాతి కిషోర్ దంపతుల ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ప్రజలు ఆళ్ల నాని కి గజ మాలతో ఘన స్వాగతం పలికారు..
గులాబీ పూలతో బారులు తీరి ముస్లిం చిన్నారులు పలికిన ఆత్మీయ స్వాగతం అందరిని ఆకట్టుకుంది.
ప్రతి ఒక్క చిన్నారిని ఆళ్ల నాని ఆత్మీయంగా పలకరించారు.
అనంతరం డివిజన్ లోని యాదవ్ నగర్-2 సచివాలయ పరిధిలోని ప్రతి గడప గడపకు వెళ్లిన ఆళ్ల నాని సంక్షేమ పథకాల అమలు తీరును స్వయంగా పరిశీలించారు.
ప్రతి నెలా ఫించన్ అందుతున్న తీరు, ఇంటి స్థల వచ్చిందా అమ్మా?.. అమ్మ ఓడి వచ్చిందా అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ సంక్షేమ పథకాల అమలు తీరును స్వయంగా అడిగి తెలుసు కున్నారు.
ఈ సందర్భంగా సంక్షేమ పథకాల తో తమకు ఆర్ధిక సమస్యల్లో ప్రభుత్వం అండగా నిలిచిందని, లక్షల రూపాయల విలువైన సొంత ఇంటి స్థలాన్ని కానుకగా ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆళ్ల నాని గారిని తమ జీవితాంతం మరువలేమని లబ్దిదారులు ఆళ్ల నాని కి తెలిపారు.
ఈ సందర్భంగా అర్హత ఉండి కూడా, సాంకేతిక కారణాల వల్ల సంక్షేమ పధకాలు అందని వారి సమస్యలు సత్వరమే పరిష్కరించి, వారికి కూడా పధకాలు అందచేసేలా చర్యలు తీసుకోవాలని ఆళ్ల నాని అధికారులకు సూచించారు.
స్థానిక ముట్ల కోనేరు నుంచి డ్రెయిన్ నీరు బయటకి పోయేలా సత్వరమే ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించి, అంచనా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆళ్ల నాని స్థానికులకు తెలిపారు.
మద్యాహనమ్ 3గంటల నుంచి రాత్రి 8.00 వరకు జోరువానలో సైతం ప్రజల నీరాజనాలు, ఆత్మీయ పలకరింపుల మధ్య మాజీ ఉపముఖ్యమంత్రి, సాసనసభ్యులు ఆళ్ల నాని చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 17వరోజు ఆద్యంతం ఉత్సాహ భరితంగా సాగింది.
ఈ కార్యక్రమంలో ఏలూరు నగర డిప్యూటీ మేయర్లు నూకపెయ్యి సుధీర్ బాబు, గుడిదేసి శ్రీనివాస్, మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ నెరుసు చిరంజీవులు, వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు ఖాజా ముగ్ధుమ్, కోరాడా బాబు, నగర బీసి సెల్ అధ్యక్షులు పొడిపిరెడ్డి నాగేశ్వర్ రావు, కార్పొరేటర్లు, జుజ్జువరవు విజయ నిర్మల రమేష్,జయకర్, జనపరెడ్డి రాజేశ్వరి కృష్ణ,కర్రి శ్రీనివాస్, తంగేళ్ల రాము, వంకదారు ప్రవీణ్, పొలిమేర దాస్, దేవరకొండ శ్రీనివాస్, వైఎస్సార్ సిపి నాయకులు MRD బలరాం, SMR పెదబాబు, మున్నుల జాన్ గురునాధ్, , బండారు కిరణ్,పొలిమేర హరికృష్ణ , కిలాడి దుర్గారావు,ధనుంజయ్, నగర యువజన విభాగం అధ్యక్షులు నిరుకొండ నరేంద్ర, విద్యార్థి విభాగం అధ్యక్షుడు శివ రావ్, సేవాదల్ అధ్యక్షుడు ఎల్లపు మోజెస్, పల్లి శ్రీనివాస్ రావు, విజయ్ కుమార్ జైన్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు రియాజ్ అలీ ఖాన్, చేనేత సొసైటీ చైర్మన్ కొల్లిపాక సురేష్, తోటకూర కిషోర్, మాగంటి హేమ, పల్లి శ్రీనివాస్ రావు ప్రత్తిపాటి తంబి, కొల్లి నాగేశ్వరావు, విటలా చంద్రశేఖర్, మహిళా నాయకులు పార్వతి, సుల్తాన్,
పార్టీ పలు విభాగాల అధ్యక్షులు,లీగల్ సెల్ అధ్యక్షులు రామాంజనేయులు, లీగల్ సెల్ నాయకులు , ఎమ్మార్వో సోమశేఖర్, MHO డా.మాలతి, మునిసిపల్, రెవెన్యూ,హౌసింగ్ సహా పలు శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు....
addComments
Post a Comment