వినాయక నిమజ్జనం శోభయాత్రలో పాల్గొన్న కలెక్టర్ శివశంకర్ లోతేటి

 వినాయక నిమజ్జనం శోభయాత్రలో పాల్గొన్న   కలెక్టర్ శివశంకర్ లోతేటి 
నరసరావుపేట, సెప్టెంబర్ 08 (ప్రజా అమరావతి ) : వినాయక చవితి పండుగను పురస్కరించుకుని అత్యంత ప్రతిష్టాత్మకంగా మహానగరాలకు దీటుగా నరసరావుపేట కాకుమాను బజారులో  నిర్వహించే ఉత్సవాలలో పల్నాడు జిల్లా తొలి కలెక్టర్ శివ శంకర్ లో తేటి ఐఏఎస్ పాల్గొన్నారు.   కాకుమాను బజారులో 23 సంవత్సరాలుగా ఆనవాయితీగా జరుగుతున్న  జిల్లాలోనే  ప్రతిష్టాత్మకంగా జరిగే వినాయక ఉత్సవంలో చివరి రోజు శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ కాకుమాను బజారు నరసరావుపేట వారిచే శివశక్తి మోక్ష గణపతి స్వామివారి శోభాయాత్ర ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా కనుల పండుగ గా జరిగింది. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ శివ శంకర్ లో తేటి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తొలుత ఉత్సవ కమిటీ  తో పాటు పట్టణ ప్రముఖులు కలెక్టర్ వారికి ఘనంగా స్వాగతం పలికారు. మిట్టపల్లి గ్రూప్ ఆఫ్ కాలేజ్ చైర్మన్ మిట్టపల్లి రమేష్ కలెక్టర్ వారిని దుశ్యాలువ తో  కప్పి మెమెంటో ఇచ్చి తగిన రీతిగా ఘనంగా సత్కరించారు. కలెక్టర్ శివ శంకర్ లోతేటి స్వామివారిని దర్శించుకుని టెంకాయ కొట్టి స్వయంగా తన చేతులతో హారతి ఇవ్వడం జరిగింది. అర్చకులు స్వామివారి వద్ద ప్రత్యేక పూజ చేసి తీర్థప్రసాదాలు ఆశీర్వచనాలు అందజేశారు. ఉత్సవాన్ని తిలకించిన  సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ మహానగరాలకు దీటుగా కాకుమాను బజారు గణేష్ ఉత్సవం తాను విన్నదానికంటే అద్భుతంగా ఏర్పాట్లు ఉన్నాయని కమిటీ వారిని మెచ్చుకున్నారు. కమిటీ వారు మాట్లాడుతూ పల్నాడు జిల్లా కు తొలి కలెక్టర్ గా విచ్చేసి, వినూత్నమైన పాలన తనదైన శైలిలో  ఆదర్శానికి నిదర్శనంగా  బిజీ షెడ్యూల్ ఉండి కూడా ఆహ్వానం మేరకు విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ ఊరేగింపు కార్యక్రమంలో   నాగసరపు సుబ్బరాయ గుప్తా, కపిలవాయి విజయ్ కుమార్ బత్తుల మురళి, కొత్తూరు కిషోర్ పట్టణంలోని అన్ని అసోసియేషన్లు అన్ని వర్గాల ప్రజలు, "కాకుమాను బజారు శ్రీగణేష్ ఉత్సవ కమిటీ" కన్వీనర్ కొత్త పెద్దన్న దివ్వెల రామకృష్ణ మురారి శెట్టి శేషాద్రి అడ్డగిరి ద్వారకా వాసు కారం శెట్టి రాంబాబు ఇమ్మిడి శెట్టి నరసింహారావు అడ్డగిరి ద్వారకా వాసు కందుకట్ల రంగనాయకులు చేబ్రోలు ఫణి కుమార్ భగత్ సంజయ్ బ్రహ్మం రామాంజనేయులు సత్యనారాయణ శ్రీనివాసరావు భాస్కర్ రామకృష్ణ  యదార్థం న్యూస్ తిర్లిక శ్రీనివాస్ మీడియా మిత్ర కొణిజేటి రమేష్ పలువురు పాల్గొన్నారు.Comments