పనులకు సంబంధించి కలుగ చేసిన వసతుల, సౌకర్యాల వివరాలు వెబ్ సైట్ లో నూరు శాతం అప్లోడ్ చెయ్యాలి



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 



 మన బడి నాడు నేడు కింద జిల్లాలో 647 స్కూల్స్ లో చేపడుతున్న పన్నెండు ప్రాధాన్యత పనులు ప్రగతి వెబ్ సైట్ లో అప్లోడ్ చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదేశించారు.


శనివారం సాయంత్రం మండల విద్యా అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ డి ఈ వో ఎస్

అబ్రహం తో కలిసి నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ,  రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి, కార్పొరేట్ స్కూల్స్ తరహా విద్యా బోధన అందించే సామర్థ్యం పెంచే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ఇప్పటికీ తొలి దశ పూర్తి చేసి, రెండవ దశలో జిల్లాలో 647 స్కూల్స్ లో అభివృద్ధి పనులు చెయ్యడం ద్వారా మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఆయా పనులకు సంబంధించి కలుగ చేసిన వసతుల, సౌకర్యాల వివరాలు వెబ్ సైట్ లో నూరు శాతం అప్లోడ్ చెయ్యాలి


ఉండగా దాదాపు పూర్తి చేసిన కొందరు ఎమ్ ఈ వో లు దృష్టి పెట్టక పోవడం పై మండలాలు వారీగా సమీక్ష చేశారు. ఫర్నిచర్ కి 635 లో కల్పించగా ఇంకా 12 స్కూల్స్ లో పెండింగు లో ఉన్నాయని రాజమహేంద్రవరం పరిధిలోని ఆరు స్కూల్స్, గోపాలపురం, నల్లజర్ల లో రెండేసి స్కూల్స్, గోకవరం, కోరుకొండ లో ఒక స్కూల్స్ వివరాలు వెంటనే అప్లోడ్ చేయాలన్నారు. జిల్లాలో 647 స్కూల్స్ కి గాను రూఫ్ మరమ్మతులు 636 స్కూల్స్ లో, టైల్స్ రిపేర్లు 638, గ్రీన్ బోర్డ్స్ 643, ఫ్యాన్స్ 643, శానిటరీ, పెయింటింగ్ 638, త్రాగునీటి వసతి 639, టెలివిజన్ 438, జీ ఐ తలుపులు 637, జీ ఐ కిటికీలు 638, విద్యుత్ పనులు 637 పూర్తి చేసి వాటి వివరాలు అప్లోడ్ చెయ్యడం జరిగిందన్నారు. మిగిలిన పనులు కూడా త్వరిత గతిన పూర్తి చేసి పనులను సంబంధించిన ఫోటోలు, వివరాలు అప్లోడ్ చెయ్యడం పై జిల్లా విద్య అధికారి వ్యక్తిగత సమీక్ష చేసి, ఆదివారం పూర్తి చేయాలన్నారు. ఇప్పటికీ స్కూల్స్ లో చేపట్టవలసిన మరమ్మత్తుల పనులను కూడా వేగవంతం చెయ్యాలని, దసరా పండుగ సెలవులు సమయంలో నిర్మాణ పనులు పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు.





Comments