*‘గడప గడపకు మన ప్రభుత్వంపై ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో వర్క్‌షాప్:*
*పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇంఛార్జ్ మంత్రులు, ముఖ్య నేతలతో పాటు, 175 నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరు:*
*వర్క్‌షాప్‌లో సీఎం శ్రీ వైయస్ జగన్ ప్రసంగం:*
అమరావతి (ప్రజా అమరావతి);
*‘గడప గడపకూ మన ప్రభుత్వం’ వర్క్‌షాప్‌లో సీఎం శ్రీ వైయస్ జగన్, ఏం మాట్లాడారంటే..:*
*అన్నీ అనుకూలం:*
గడప గడపకూ తలెత్తుకుని వెళ్లే పరిస్థితి మనకు ఉంది
. ఎందుకంటే.. మనం ఆమేరకు చక్కటి పరిపాలన ప్రజలకు అందించాం. ఆ తర్వాతనే మనం ప్రతి గడప గడపకూ వెళ్తున్నాం. ప్రతి ఇంటికీ ఏం మేలు జరిగింది? ఎంత మేలు జరిగింది? ఏ స్కీములందాయి? అన్న జాబితాలు తీసుకుని వెళ్తున్నాం. ఈ మేరకు ప్రతి కుటుంబానికి లేఖను కూడా అందిస్తున్నాం. 98.4 శాతం హామీలు అమలు చేశాం. రూ. 1.71లక్షల కోట్లు డీబీటీ రూపంలో అందించాం. మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయం చూడకుండా, పార్టీలు చూడకుండా అర్హులందరికీ అందించాం. ఇచ్చిన హామీలు నెరవేర్చాం, మీ ఇంటికి మేలు చేశాం, ఆశీర్వదించండి అని దేశరాజకీయ చరిత్రలో ఇలా ప్రజలముందుకు వెళ్తున్న ఏకైక ప్రభుత్వం మనది.
ప్రతి ఇంట్లోనూ.. మీరు చెప్పిన దాంతో ఏకీభవించి మన ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ప్రభుత్వాలకు ఇలాంటి సందర్భాలు గతంలో లేవు. ఇలాంటి సందర్భం ఏ ప్రభుత్వంలోనూ రాదు. ఇది చాలా అరుదు. గతంలో నాన్నగారి ప్రభుత్వ హయాంలో చూశాం. దాని కంటే ఎక్కువగా ఇప్పుడు జరుగుతోంది. ఇంతటి సానుకూల
పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోవడం అవసరం.
*100 శాతం ఇళ్లకు వెళ్లాలి:*
ఒక సచివాలయానికి (గ్రామం) వెళ్లినప్పుడు 100 శాతం ఇళ్లు పూర్తి చేయడం తప్పనిసరి. అలా చేయకపోతే దానివల్ల నష్టం జరుగుతుంది. ఒకసారి మనం గ్రామ సచివాలయానికి వెళ్తే ఎన్ని రోజూలైనా సరే మొత్తం అన్ని ఇళ్లకూ వెళ్లాలి. గడపగడపకూ కార్యక్రమాన్ని నిర్దేశించుకున్న విధంగా సంపూర్ణంగా పూర్తిచేయాలి. మనం ప్రతి సచివాలయానికి రూ.20 లక్షల నిధులు ఇస్తున్నాం. గ్రామానికి బాగా ఉపయోగపడే వాటిపై ఖర్చు చేయమన్నాం.
*సమస్యలు తీర్చాలి:*
గ్రామ సచివాలయాల్లో ఎమ్మెల్యే తిరిగినప్పుడు కేటాయించిన నిధుల ప్రకారం పనులు మంజూరుచేయాలి. మీరు గ్రామంలోకి వెళ్లినప్పుడు, సమస్య మీ దృష్టికి రాగానే, అప్పటికప్పుడే ఆ పని మంజూరు చేయాలి. ఆ సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలి.
*గడప గడపకూ కార్యక్రమంలో పురోగతి:*
మొదటిసారి వర్క్‌షాపుతో పోలిస్తే గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పురోగతి బాగుంది. కాని అందరికీ ఒక విషయాన్ని సవినయంగా తెలియజేస్తున్నాను. పరీక్ష రాసేటప్పుడు షార్ట్‌కట్స్ ఉండవు. షాట్‌కర్ట్స్‌కు మనం తావిస్తే ఆ పరీక్షల్లో ఫెయిల్ అవుతాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తించుకోవాలి.
*175 టార్గెట్. సాధించాలి:*
మళ్లీ చెబుతున్నాను. నూటికి నూరు శాతం 175కు 175 కొట్టాలి. ఒక్క సీటు కూడా మిస్‌కాకూడదు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికే గడప గడపకూ రూపంలో మీకు చక్కటి ప్రణాళిక ఇచ్చాను. 175కు 175 సీట్లు సాధించడం అన్నది అసాధ్యం కానే కాదు. ముమ్మాటికీ ఇది సాధ్యం. మనసా, వాచా, కర్మేణా దీన్ని నమ్ముతున్నాను కాబట్టి విశ్వాసంతో చెప్తున్నాను. ఎందుకు సాధ్యం కాదు. ప్రభుత్వపరంగా మంచి పనులు చేశాం. రాష్ట్రంలో 85 శాతం ఇళ్లకు మంచి జరిగింది. ప్రతి ఇంటికీ మంచి చేశామని లెటర్ కూడా తీసుకుని వెళ్తున్నాం. దీనికి స్పందనగా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. గ్రామంలో సచివాలయానికి వెళ్లేటప్పుడు ప్రాధాన్యతా పనులుగా మీరు గుర్తించిన పనులు 2 నెలల్లో మొదలయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.
గడప గడపకూ కార్యక్రమం ఎందుకంటే, రేపు మనల్ని మనం గెలిపించుకోవడం కోసం... మనకు మనంగా చేస్తున్న కార్యక్రమం ఇది. దీంట్లో ఎక్కడైనా షార్ట్‌కట్స్ ఉపయోగిస్తే నష్టపోయేది మనమే. ఇవాళ్టి నుంచి చూస్తే ఎన్నికలకు బహుశా 19 నెలలు ఉంది. ప్రతిరోజూ కూడా పరీక్షలకు సిద్ధం అవుతున్నామని భావించి అంతా అడుగులు వేయాలి. అలా చేయకపోతే పని చేయకపోతే నష్టపోయేది మనమే.
అందుకు మీరు చేయాల్సిందల్లా నెలలో కనీసం 16 రోజులు గడప గడపకూ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలి. ఎన్నికలకు 19 నెలలు ఉంది. అంటే మనకు తగిన సమయం ఉంది. మనం చేయాల్సిందల్లా ప్రతి ఇంటికీ పోవడం. తిరిగితేనే మన గ్రాఫ్ పెరుగుతుంది.
కొందరు తమ గ్రేడ్ పెంచుకోవాల్సి ఉంది. ప్రతి ఒక్కరితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ నాతో అడుగులు వేశారు. అందుకే ఎవరినీ పోగొట్టుకోవడం నాకిష్టం లేదు. వారి గేర్ మార్చడమే నా లక్ష్యం. ఎన్నికలకు 6 నెలల ముందు సర్వే చేయిస్తాను. ప్రజాదరణ ఉంటేనే మళ్లీ టికెట్లు ఇస్తాను. ఎందుకంటే మనల్ని నమ్ముకుని కోట్ల మంది ఉన్నారు. షార్ట్ కట్స్ లేకుండా 100 శాతం గడపగడపకూ పూర్తిచేయాలి. మీ తరఫు నుంచి ఇది జరిగితే.. క్లీన్‌స్వీప్‌చేస్తాం.
తిరిగి డిసెంబరులో మొదటి రెండు వారాల్లో సమావేశం అవుదాం. అప్పటికి మనకు 70 రోజుల టైమ్ వస్తుంది. కాబట్టి నెలకు 16 రోజులు. ప్రతి సచివాలయంలో ప్రతి ఇల్లు తిరగాలి. ప్రతి సచివాలయంలో కనీసం మూడు రోజులైనా ఉండాలి.
రాజకీయం అనే జీవితాన్ని మనం ఎంచుకున్నాం. దానికోసం ఇది చేస్తున్నాం. ఎమ్మెల్యేలుగా ఎన్నికై మళ్లీ గెలుచుకుని రావడం అన్నది.. ప్రజల్లో మరింత గౌరవాన్ని పెంచుతుంది. అందుకనే ఈ కార్యక్రమం. ఎమ్మెల్యేలుగా ఉన్న మీరు తిరిగి ఓడిపోతే గౌరవం తగ్గుతుంది. దేవుడి దయవల్ల మనకు అలాంటి పరిస్థితి లేదు. మనం కష్టపడితే చాలు, తిరిగి గెలుచుకుని రాగలుగుతాం. మన పాలనద్వారా ప్రజలకు మంచి చేయగలిగిన కార్యక్రమాలన్నీ చేపట్టాం. మన గ్రాఫ్ పెంచుకోవడానికి అవసరమైన ఇవి రకాల అస్త్రాలు, ఆయుధాల్లాంటివి. అవి మీ చేతుల్లో ఉన్నాయి. వాటిని వినియోగించుకోండి. మనల్ని నమ్ముకుని కొన్ని కోట్ల మంది ఉన్నారు. వారికి మనం జవాబుదారీ తనంగా ఉన్నాం. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు. జుట్టు లేకపోతే ముడేసుకోవడానికి ఏమీ ఉండదు. అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేయగలుగుతాం. 175కి 175 టార్గెట్ పెట్టుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్యం మిస్‌కాకూడదు. దానికోసం అందరూ కష్టపడదాం.
రీజినల్ కోఆర్డినేటర్లుగా ఉన్నవారు మరింత బాధ్యతగా ఉండాలి. గడప గడపకూ విషయంలో ఎవరైనా వెనకబడినట్టు ఉంటే వారిని ఎప్పటికప్పుడు అలర్ట్‌చేయాలి. వారిని గైడ్ చేయాలి.
addComments
Post a Comment