బంటుమిల్లి (బర్రిపాడు/కంచడం): సెప్టెంబర్ 04, (ప్రజా అమరావతి);
*జగన్ నిత్యం ప్రజల బాగు కోసం పరితపించే ముఖ్యమంత్రి
*
*--- మంత్రి జోగి రమేష్*
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిత్యం ప్రజల బాగు కోసం పరితపించే ముఖ్యమంత్రి అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు.
ఆదివారం ఆయన పెడన నియోజకవర్గం, బంటుమిల్లి మండలంలోని బర్రిపాడు, కంచడం గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని గృహాలను సందర్శించారు. లబ్ధిదారుల బాగోగులను ఆరా తీస్తూ, ప్రభుత్వం నుంచి వివిధ పథకాల రూపంలో వారు పొందిన లబ్ధిని వివరిస్తూ మంత్రి కరపత్రాలను అందించారు.
ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం నవరత్నాలు అమలపరచడమే కాకుండా ఆయ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అని వాకబు చేసేలా మమ్మల్ని ప్రజల వద్దకు పంపి పథకాల అమలులో పారదర్శకతను పెంచారన్నారు. పథకాల అమలులో ఎలాంటి పక్షపాతం, రాజకీయ, కులమత భేదాలు చూపకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కంచడం, బర్రిపాడు గ్రామ పంచాయితీలకు రూ.7.31 కోట్లు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులకు అందించినట్లు మంత్రి తెలిపారు. ప్రజల బాగోగుల కోసం శ్రమిస్తున్న జగనన్నను మరింత మంచి చేసేలా దీవించాలని మంత్రి కోరారు.
గ్రామస్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం, విద్యుత్ స్థంబాలు వేయించాలని కోరగా, అందుకు స్పందించిన ఆయన ఒక్కో సచివాలయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.20 లక్షల నిధులను కంచడం, బర్రిపాడు గ్రామాలకు అవసరమైన పనుల కోసం ఆ నిధులను వెచ్చిస్తున్నట్లు మంత్రి వారికి తెలిపారు. అదేవిధంగా రూ.48 లక్షలతో కంచడం, రూ. 9 లక్షల వ్యయంతో బర్రిపాడు గ్రామాల్లో ఇంటింటికీ మంచినీటి కుళాయి త్వరలోనే ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో బంటుమిల్లి జెడ్పీటీసీ మలిసెట్టి వెంకట రమణ, బర్రిపాడు గ్రామ సర్పంచ్ పామర్తి వీరవెంకటేశ్వరరావు, కంచడం ఎంపీటీసీ పాపాని భగవాన్, కంచడం గ్రామ సర్పంచ్ బండారు చంద్రశేఖర్, బంటుమిల్లి ఎంపిపి వెలివెల చినబాబు, బంటుమిల్లి ఎంపిడిఓ స్వర్ణ భారతి, బంటుమిల్లి తాసిల్దారు సత్యనారాయణ, మండల వైస్ ఎంపిపి ఒడిమి చిన్నారి బాబు, ఏఎంసి చైర్మన్ పాలడుగు బాబురావు, వివిధ శాఖల అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment