శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి

 

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి):

     రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు మరియు దేవాదాయశాఖ మంత్రివర్యులు అయిన శ్రీ కొట్టు సత్యనారాయణ , ఆలయ  కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ , మరియు పోలీసు శాఖ అధికారులు దేవస్థానం నందు నిర్వహించు దసరా -2022 మహోత్సవములు ఏర్పాట్లులో భాగంగా  

భవానీ ఘాట్, పున్నమి ఘాట్, ఓం టర్నింగ్, క్యూ లైన్ లు, సీతమ్మ వారి పాదాలు, ప్రసాదం కౌంటర్లు మరియు ఇతర ప్రదేశముల యందు భక్తుల సౌకర్యార్ధం దేవస్థానం వారు చేసిన పలు ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ ఏర్పాట్లు గురించి  ఆలయ కార్యనిర్వహణాధికారి , ఆలయ ఇంజినీరింగ్ అధికారులు, పోలీసు శాఖ వారు గౌరవ మంత్రివర్యుల వారికి వివరించారు.

 అనంతరం  మంత్రివర్యుల వారు  కార్యనిర్వహణాధికారి గారికి మరియు ఆలయ ఇంజినీరింగ్ అధికారులకు సూచనలు అందజేశారు.


ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్లు శ్రీ కె.వి.ఎస్ కోటేశ్వరరావు , శ్రీమతి లింగం రమాదేవి , నగర పశ్చిమ ఇంచార్జి డిసిపి శ్రీ కొల్లి శ్రీనివాసరావు  మరియు విజయవాడ పశ్చిమ ఏసిపి శ్రీ హనుమంతరావు , I టౌన్ CI శ్రీ పి.వెంకటేశ్వర్లు  మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Comments