వరుసగా మూడో ఏడాది "వై.ఎస్.ఆర్ చేయూత" ప్రారంభం


 *వరుసగా మూడో ఏడాది "వై.ఎస్.ఆర్ చేయూత" ప్రారంభం*


*: జిల్లాలో మూడో విడత "వై.ఎస్.ఆర్ చేయూత" పథకం కింద అర్హులైన 1,11,189 మంది లబ్ధిదారులకు రూ.208.48 కోట్ల లబ్ధి*


*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), సెప్టెంబర్ 23 (ప్రజా అమరావతి):


చిత్తూరు జిల్లా కుప్పం పట్టణం నుంచి శుక్రవారం ఉదయం "వై.ఎస్.ఆర్ చేయూత" పథకం కింద వరుసగా మూడో ఏడాది ఆర్థిక సహాయాన్ని అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేసే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు..


పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి వరుసగా మూడో ఏడాది "వై.ఎస్.ఆర్ చేయూత" కింద ఆర్థిక సహాయాన్ని అందజేసే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, రాష్ట్ర వక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ నళిని, జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఓబులపతి, వైస్ చైర్మన్ శ్రీలక్ష్మి, తిప్పయ్య, డిఆర్డిఎ పిడి నరసయ్య, జిల్లా సమైక్య అధ్యక్షురాలు సాయిలీల, మెప్మా అధ్యక్షురాలు సాయిలీల, తదితరులు పాల్గొన్నారు..


జిల్లాలో మూడో విడత "వై.ఎస్.ఆర్ చేయూత" పథకం కింద అర్హులైన 1,11,189 మంది లబ్ధిదారులకు రూ.208.48 కోట్ల లబ్ధి : జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్.


జిల్లాలో మూడో విడత "వై.ఎస్.ఆర్ చేయూత" పథకం కింద అర్హులైన 1,11,189 మంది లబ్ధిదారులకు 208.48 కోట్ల రూపాయల లబ్ధి  కలగడం జరిగిందని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ పేర్కొన్నారు. వై.ఎస్.ఆర్ చేయూత పథకం కింద 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఏటా 18,750 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరుగుతోందన్నారు. ఇప్పటికే రెండు విడతలుగా ఆర్థిక సహాయం అందించగా, ప్రస్తుతం మూడో విడత ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా, గతంలో ఎన్నడూ లేని విధంగా అక్క చెల్లెమ్మలకు చేయూతనందించే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందన్నారు. దీని ద్వారా జీవనోపాధి కల్పన, అక్కచెల్లెమ్మల సాధికారత, ఆర్థిక స్వావలంబన కలుగుతోందన్నారు. పేద అక్కచెల్లెమ్మల చేతిలో డబ్బులు పెడితే వారి కుటుంబానికి మంచి జరుగుతుందని, వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో అమలు చేయడం జరుగుతోందన్నారు.


జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గంలో 15,417 మందు అర్హులైన లబ్ధిదారులకు 28.19 కోట్ల రూపాయల లబ్ధి కలిగిందన్నారు. ధర్మవరం నియోజకవర్గంలో 16,680 మందు అర్హులైన లబ్ధిదారులకు 31.28 కోట్ల రూపాయలు, హిందూపురం నియోజకవర్గంలో 17,053 మందు అర్హులైన లబ్ధిదారులకు 31.97 కోట్ల రూపాయలు, కదిరి నియోజకవర్గంలో 17,770 మందు అర్హులైన లబ్ధిదారులకు 33.32 కోట్ల రూపాయలు, మడకశిర నియోజకవర్గంలో 20,025 మందు అర్హులైన లబ్ధిదారులకు 37.55 కోట్ల రూపాయలు, పెనుకొండ నియోజకవర్గంలో 18,194 మందు అర్హులైన లబ్ధిదారులకు 34.11 కోట్ల రూపాయలు, రాప్తాడు నియోజకవర్గంలోని మూడు మండలాల్లో 6,050 మందు అర్హులైన లబ్ధిదారులకు 11.34 కోట్ల రూపాయల లబ్ధి కలిగిందన్నారు. మూడో విడత "వై.ఎస్.ఆర్ చేయూత" పథకం కింద జిల్లాలో మొత్తం అర్హులైన 1,11,189 మంది లబ్ధిదారులకు 208.48 కోట్ల రూపాయలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మహిళల అధికారులకు 208.48 కోట్ల రూపాయల మెగా చెక్ ను జిల్లా కలెక్టర్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లబ్ధిదారులు, డి ఆర్ డి ఏ, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image