రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి):
"పూలే సత్య సమాజ శోధక్" స్ఫూర్తి ని భవిష్యత్ తరాలకు అందించటానికి మహిళా కమిషన్ చొరవ అభినందనీయం
అని శాసన మండలి ఛైర్మన్ కోయ్యే మోషన్ రాజ్, జిల్లా ఇంఛార్జి మంత్రి వేణుగోపాల్ కృష్ణ అన్నారు.
శనివారం ఫూలే సత్య శోధక్ సమాజ్ 150 వ వార్షిక వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ కోయ్యే మోషన్ రాజ్, మంత్రి సిహెచ్.ఎస్.వేణుగోపాల్ కృష్ణ, ఎంపి మార్గని భరత్ రామ్, సభాధ్యక్షత వహించిన వాసిరెడ్డి పద్మ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్య అతిథి శాసన మండలి ఛైర్మన్ కోయే మోషన్ రాజ్ మాట్లాడుతూ ఇంకా మహిళ హక్కులు, ఆశయాలు కోసం పోరాటాలు చేస్తున్నారని, ఆ పరిస్థితి ఉండడం దురదృష్ట కరం అన్నారు. గత మూడు సంవత్సరాలుగా మహిళలు, అట్టడుగు, వెనుక బడిన వర్గాల కోసం అమలు చేస్తున్న పథకాలు ఆదర్శం అన్నారు. అంబేద్కర్ వంటి గొప్ప వ్యక్తి ఆశయ సాధన ద్వారా ఆదర్శనీయుడైతే, తనకు పూలే గురువు అని చెప్పడం ద్వారా ఫూలే గొప్పతనం రాబోయే తరాలు తెలుసుకోవాలన్నారు. ఈ ప్రభుత్వం అంబేద్కర్, పూలే వంటి ఆశయ సాధన కోసం పనిచెయ్యడం అభినందనీయం అన్నారు. ఈ ప్రభుత్వం అన్ని పథకాలు మహిళలు పేరునే అమలు చేయడం జరుగుతొందని అన్నారు.
రాష్ట్ర వెనుకబడిన సంక్షేమ, సమాచార పౌర సంబంధాల మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ, సత్య శోధక్ సమాజ్ పేరులోనే ఒక విశిష్ట తో కూడుకున్నదని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయ లకు అనుగుణంగా ఆలోచించి మహిళా కమిషన్ తీసుకునే కార్యక్రమాలు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని అన్నారు. యుగ ధర్మానికి అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. సావిత్రి బాయి పూలే ఆలోచనలతో నేడు మహిళలు చేరుకున్న ఉన్నత స్థాయి కి కారణం అన్నారు. రాజమహేంద్రవరం కి చెందిన కందుకూరి వీరేశలింగం పంతులు చేపట్టిన సతి సహగమనం ని వ్యతిరేకించిన వ్యక్తి ని స్మరించు కోవడం ముఖ్యం అన్నారు. మహాత్మా గాంధీ, అంబేడ్కర్ లకు స్పూర్తి జ్యోతి రావ్ పులే ఏర్పాటు చేసిన సత్య సమాజ శోధక్ ను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. సంఘ సంస్కర్త గా జ్యోతి రావ్ పూలే అభివర్ణించడం లో ఎటువంటి అతిశయోక్తి కాదన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా స్కూల్స్ లో ఆడపిల్లలు హాజరు తక్కువగా ఉండడం గమనించి కారణం తెలుసుకున్నానని, ఆనాడు సంఘటనతో స్కూల్స్ లో బల్లలు ఏర్పాటు ఆలోచన వచ్చిందన్నరు. ఎలాగైనా స్కూల్స్ లో బల్లలు ఏర్పాటు సంకల్పం చెయ్యగా అప్పటి వరకు ఇసుక ద్వారా రూ.2 కోట్లు వొచ్చే ఆదాయం రూ.25 కోట్లు రావడం జరిగిందన్నారు. మంచి చెయ్యాలనే సంకల్పం ఉంటే పనులు సాకారం అవుతాయని అనడానికి ఇలాంటివి ఘటనలే నిదర్శమన్నారు.
పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్ మాట్లాడుతూ, మహిళా, పురుష ల జెండర్ భేదాలు నేటికీ ఇంకా సమాజంలో ఉన్నాయన్నారు. ఆనాడు పూలే అంబేద్కర్ వంటి వ్యక్తులు వివక్ష పై అలుపెరుగని పోరాట స్ఫూర్తిని కలిగించారాన్నరు.
పులే సతీమణి సావిత్రి బాయి పూలే కి విద్య ను నేర్పించి ఒక స్పూర్తి పెంచే వ్యక్తిగా తీర్చి దిద్దారన్నారు. విద్య ద్వారా ఉన్నత స్థాయి కి చేరుకో గలమని అన్నారు. గత ప్రభుత్వాలు ఎన్నికల ముందు డబ్బులు పంపిణీ చేసే వారని అన్నారు. నేడు ప్రతి ఒక్కరూ గుండె మీద చేతులు వేసుకుని చెప్పండి, కరోనా విపత్తు సమయంలో ఆర్థికంగా అండగా నిలిచిన సంగతి గుర్తు చేసుకోవాలన్నారు. మన జగనన్న ప్రభుత్వం కాకుండా వేరే ప్రభుత్వం ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచన చెయ్యాలని పేర్కొన్నారు. నవ సమాజాన్ని స్థాపన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఎంపి భరత్ పిలుపు నిచ్చారు.
జ్యోతిరావు పూలే 150 ఏళ్ల సంవత్సరాల క్రితం అంకురార్పణ చేసిన కార్యక్రమాల స్ఫూర్తితో పూలే సత్య శోధక్ సమాజ పరిణామ క్రమం నిర్వహించడం జరుగుతోందని మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఫూలే ఆశయ సాధన కోసం కృషి చేసే కృష్ణా రావు వంటి వ్యక్తులు ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న బిసి లు, వెనుకబడిన వర్గాలు కోసం, మహిళలు కోసం పథకాలు అభినందించడం వాస్తవిక ఉందన్నది వాస్తవం అన్నారు.
అంబేద్కర్, ఫూలే ఆశయ సాధనకు 150 ఏళ్లు దాటిన ఇంకా ఆయా వర్గాలకు న్యాయం జరగక పోవడం ఏమిటని ప్రశ్నించారు. వారి ఆశయ స్పూర్తితో యువత ముందుకు అడుగులు వేయాలన్నారు. అయితే ఆయా వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అనడంలో అతిశయోక్తి లేదన్నారు. మద్య పాన నిషేధం పై పోరాటాన్ని చేసిన మొట్ట మొదటి వ్యక్తి పూలే అన్నారు. ఈ మూడెళ్ళ కాలంలో ఎన్నడూ జరగని విధంగా మహిళా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరే నిదర్శనం అన్నారు. ఈ ప్రభుత్వం అన్నింటిలో 50 శాతం నినాదంతో ముందుకు వెళుతోందని వాసిరెడ్డి పద్మ అన్నారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలను వేదింపులు గురిచేసిన చరిత్ర గత ప్రభుత్వానిది అన్నారు. బిసి లు అంటే బ్యాక్ బోన్ అనే విధంగా ప్రస్తుతం గుర్తింపు నివ్వడం జరుగుతోందని పేర్కొన్నారు. పులే ఆశయ సాధనకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కు అండగా ఉండాలన్నారు. హిందూ బిల్లు కోసం న్యాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన అంబేడ్కర్ వంటి వారి నుంచి స్ఫూర్తి పొందాలని అన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మహిళలు కోసం, అట్టడుగు వర్గాల కోసం ఆలోచించే వారు నాయకుడిగా ఉండాలన్నారు. బిసి, ఎస్సీ, ఎస్టీ , వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం గతంలో ఆయా ప్రభుత్వాలు ఏమి చేశారని అన్నారు.
అమ్మాయిలకు పోలీసుల రక్షణ కల్పించే యాప్ దిశా యాప్ అనడంలో అతిశయోక్తి లేదని శ్రీకాకుళం ఎస్పీ జీ ఆర్ రాధిక అన్నారు. సమాజంలో ఎటువంటి నేరాలు జరిగినా స్పందించే సామాజిక స్మృహ ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు. కోరుకున్న రంగాల్లో ఉన్నత లక్ష్యాలను సాధించడానికి అవకాశాలు ఉన్నాయి వాటిని నేటి యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రూడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి, రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇళ్ళ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం ఎస్పీ జీ.ఆర్. రాధిక, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, అధికారులు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, జక్కంపూడి. విజయలక్ష్మి, మహిళా కమిషన్ సభ్యులు కర్రీ జయశ్రీ, ఫూలే వ్యవస్థాపక సమాజ అధ్యక్షులు నయనాల కృష్ణా రావు, డి. గీతామాధురి , ఎమ్. రాజ్యలక్ష్మి, భవానీ ప్రియ, డా. ఏ. పద్మలత, జక్కంపూడి విజయలక్ష్మి, బర్రె కొండబాబు, వై. హరిత, ఎస్ కే షకీలా బేగం, డా కోమలి, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment