ముఖ్యమంత్రికి ఘనంగా వీడ్కోలుముఖ్యమంత్రికి ఘనంగా వీడ్కోలుతిరుపతి, సెప్టెంబర్ 06 (ప్రజా అమరావతి): గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు నెల్లూరు జిల్లాలోని పలు కార్యక్రమాల్లో పాల్గొని కొవ్వూరు హెలిపాడ్ నుండి హెలికాప్టర్ లో బయల్దేరి మధ్యాహ్నం 3:15గం. కు రేణిగుంట ఏర్పోర్ట్ కు చేరుకొన్న వీరికి ఘన స్వాగతం లభించింది.


 రాష్ట్ర భూగర్భ గనులు, అటవీ, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామి, ఎంపీ లు మిథున్ రెడ్డి, రెడ్డప్ప, గురుమూర్తి ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామి, ఎమ్మెల్యే లు చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి, కోనేటి అదిమూలం, బియ్యపు మధుసూధన్ రెడ్డి, జెడ్ పి చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డా శిరీష, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్, తిరుపతి జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి, ఈ ఎం సి క్లస్టర్ సీఈఓ గౌతమి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి, ఎస్పీలు రిషాంత్, పరమేశ్వర రెడ్డి, జేసి డి కే బాలాజీ తదితరులు గౌ ముఖ్య మంత్రిని ఘనంగా రిసీవ్ చేసుకుని వీడ్కోలు పలకగా ముఖ్య మంత్రి  గం. 3.25 లకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు ప్రత్యేక విమానంలో తిరుగు పయనం అయ్యారు. 


ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్, శ్రీకాళహస్తి చైర్మన్ అంజూరి శ్రీనివాసులు, ఏర్పోర్టు డైరెక్టర్ రాజ్ కిషోర్, ఏర్పోర్ట్ సి ఎస్ ఓ రాజశేఖర్ డిప్యూటీ కమాండెంట్ శుక్లా, డి ఎం హెచ్ ఓ శ్రీహరి,జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి బాలకృష్ణన్, జిల్లా ఫైర్ అధికారి రమనయ్య, ఆర్డీవో శ్రీకాళహస్తి  రామారావు, డిఎస్పీ లు రామచంద్రయ్య, చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


Comments