కాకినాడ ఛాంబర్ చైర్మన్గా బాబు
కాకినాడ, సెప్టెంబర్ 30 (ప్రజా అమరావతి): సుమారు 155 ఏళ్ల చరిత్ర కలిగిన ది కోకనాడ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్గా వివి రాఘవులు (బాబు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఛాంబర్ ఎన్నికలు వార్ప్రోడ్లో ఉన్న ది కోకనాడ చాంబర్ కామర్స్ కార్యాలయంలో శుక్రవారం జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన ఛాంబర్ ఎన్నికల్లో చైర్మన్గా బాబును డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ కాకినాడ సముద్రతీర ప్రాంతంలో అన్ని వాణిజ్య, వ్యాపార, కార్మిక సంఘాల సమన్వయంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎగుమతులు, దిగుమతులు జరిగేందుకు కృషి చేస్తానని బాబు చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో డైరెక్టర్లుగా ఏ కాశీ విశ్వనాథం, సి నరసింహారావు, ఏకే రౌత్, ఏవి రంగారావు, ఎమ్మెస్ కుమార్, పి వెంకటేశ్వరరావు, జి చంద్రశేఖర్, డి భాస్కర్లు ఎన్నికయ్యారు.
addComments
Post a Comment