రాష్ట్ర ప్రభుత్వం కాపు సంక్షేమానికి, కాపుల అభివృద్ధికి అనేక పధకాలను అమలు చేసుతున్నదన్నారు.


విజయవాడ (ప్రజా అమరావతి);

రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ పధకాల ద్వారా 70 లక్షల 94 వేల 881 మంది కాపులకు 32 వేల 296 కోట్లు అందించామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ మరియు  అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ అడపా శేషగిరి అన్నారు.  తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం పాత్రికేయుల సమావేశంలో అడపా శేషు  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాపు సంక్షేమానికి, కాపుల అభివృద్ధికి అనేక పధకాలను అమలు చేసుతున్నదన్నారు.


  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కాపుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నారన్నారు.  రాష్ట్ర మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులను నియమించారని, శాసన సభలో కాపు సామజిక వర్గానికి చెందిన 26 మంది శాసన సభ్యులుగా ఉన్నారని, ఇద్దరు ఎమ్ ఎల్ సి లుగా ఉన్నారని రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించి మేయర్ లు, డిప్యూటీ మేయర్ లు, కార్పొరేషన్ చైర్మన్ లుగా కాపులను నియమించారని అడపా శేషగిరి అన్నారు.  

విద్య, ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం  అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని  ప్రతీ జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని అయన అన్నారు.  విజయవాడలో చేపట్టిన ఔటర్ రింగ్ రోడ్ పనులు 65 శాతం పూర్తి అయినవని త్వరలో పనులు పూర్తి చేసి ఔటర్ రింగ్ రోడ్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. 

దేశం లోనే ఎంతో గుర్తింపు పొందిన పధకాలు ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రిని  దేశ వ్యాప్తంగా ప్రశంసించడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమన్నారు.  ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ పధకాలు తీసుకొచ్చిన తరుణంలో కరోనా మహమ్మారి వలన  కుంటుపడి విదేశీ విద్యకు అవరోధం కలిగినప్పుడు రాష్ట్ర ప్రజలకు ఆర్ధిక సహాయంతో ఎంతో ఆదుకున్న సందర్భాన్ని గుర్తించాలన్నారు.  సచివాలయ వ్యవస్థ వలన దాదాపు 1.20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రికి దక్కిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (DBT) క్రింద వివిధ ప్రభుత్వ పధకాల ద్వారా కాపు సామజిక వర్గానికి చెందిన వారికి అందించిన వివరాలు ఈవిధంగా ఉన్నాయని వై.ఎస్.ఆర్. ఆసరా క్రింద 7 లక్షల 65 వేల 309 మందికి 1 కోటీ 1 వేయి 416 కోట్లు అందించామన్నారు.  అమ్మ ఒడి పధకం క్రింద 4 లక్షల 4 వేల 583 మంది లబ్ది దారులకు 1 వేయి 715 కోట్లు, చేదోడు పధకం క్రింద 14918 మంది లబ్ది దారులకు రూ. 25.25 కోట్లు, వై.ఎస్.ఆర్. ఉచిత పంటల భీమా క్రింద 4 లక్షల 33 వేల 909 మందికి రూ. 655.12 కోట్లు, రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీగా 2 లక్షల 810 మంది రైతులకు రూ. 175.82 కోట్లు, జగనన్న తోడు క్రింద ఒక లక్ష 49 వేల 611 మందికి రూ. 149.61 కోట్లు, జగనన్న వసతి దీవెన పధకం క్రింద లక్షా 42 వేల 661 మందికి రూ. 293.45 కోట్లు, జగనన్న విద్యా దీవెన పధకం క్రింద ఒక లక్షా 92 వేల 662 మందికి రూ. 895.38 కోట్లు, వై.ఎస్.ఆర్. కాపు నేస్తం పధకం క్రింద 3 లక్షల 38 వేల 792 మందికి రూ. 1492 కోట్లు, వై.ఎస్.ఆర్. మత్స్యకార భరోసా క్రింద 701 మందికి రూ. 1.50 కోట్లు, వై.ఎస్.ఆర్. నేతన్న నేస్తం క్రింద 2577 మందికి రూ. 18.73 కోట్లు, వై.ఎస్.ఆర్. పెన్షన్ కానుక క్రింద 6 లక్షల 49 వేల 857 మందికి రూ. 4725.73 కోట్లు, వై.ఎస్.ఆర్. రైతు భరోసా క్రింద 7 లక్షల 85 వేల 700 మందికి రూ. 3487.29 కోట్లు, వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ పంట రుణాలు పధకం క్రింద 6 లక్షల 3 వేల 887 మందికి రూ. 112.11 కోట్లు, వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ (SHGS) క్రింద 8 లక్షల 77 వేల 589 మంది లబ్దిదారులకు రూ. 310.91 కోట్లు, వై.ఎస్.ఆర్. వాహన మిత్ర పధకం క్రింద 29957 మందికి రూ.104.95 కోట్లు, వై.ఎస్.ఆర్. ఆరోగ్య ఆసరా క్రింద 28 వేల 638 మందికి రూ. 23.28 కోట్లు, వై.ఎస్.ఆర్. ఆరోగ్య శ్రీ క్రింద ఒక లక్ష 33 వేల 925 మందికి రూ. 520.50 కోట్లు, వై.ఎస్.ఆర్. భీమా క్రింద 8 వేల 151 మందికి రూ. 132.87 కోట్లు కాగా నాన్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ క్రిందన (NON DBT) క్రిందన  జగనన్న గోరుముద్ద పధకం క్రింద 4 లక్షల 2 వేల 76 మందికి రూ. 274.03 కోట్లు, వై.ఎస్.ఆర్. సంపూర్ణ పోషణ క్రింద లక్షా 50 వేల 800 మందికి రూ. 229.12 కోట్లు, జగనన్న విద్యా కానుక క్రింద 4 లక్షల 5 వేల 450 మందికి రూ. 202.78 కోట్లు, హౌస్ సైట్స్ క్రింద 2,46,080 మందికి రూ. 12304 కోట్లు, హోసింగ్ క్రింద 121238 మందికి రూ. 3030 కోట్లు లబ్ది చేకూర్చడం జరిగిందని చైర్మన్ శ్రీ అడపా శేషగిరి తెలిపారు.  మొత్తం అన్ని పధకాల క్రింద 70 లక్షల 94 వేల 881 మంది లబ్దిదారులకు రూ. 32,296.37 కోట్ల రూపాయలు అందించామని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి అన్నారు.

ఈ సమావేశంలో కాపు కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ధనుంజయుడు ఉన్నారు. 


Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image