విజయవాడ, (ప్రజా అమరావతి);
శ్రీయుత సంచాలకులు, పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి చెందిన పనికిరాని, నిరుపయోగంగా ఉన్న మహేంద్ర కమాండర్, టాటా సుమో, టాటా ఇండిగో, బజాజ్ ఆటో వాహనాలు ఉన్న రీతిన ఉన్నట్లు ఈనెల 15వ తేదీన లబ్బీ పేటలోని పశు వైద్య శాల ఆవరణలో వేలం వేయనున్నట్లు ఆశాఖ సంచాలకులు శ్రీ అమరేంద్ర కుమార్ ఒక పత్రికా ప్రకటనలో తెలియజేసారు. వేలంలో పాల్గొనే సంస్థలు పాల్గొనే ముందు రూ. 5 వేల రూపాయలు ధరావతుగా చెల్లించి వేలంలో పాల్గొనాలని చెప్పారు. వేలం పాట పాడిన వారు సొమ్మును చెల్లించిన వెంటనే వాహనము స్వాధీనం చేయడం జరుగుతుందని ఆ సమయంలో ధరావత్తు సొమ్ము మినహాయించడం జరుగుతుందని శ్రీ అమరేంద్ర కుమార్ ఆ ప్రకటనలో తెలిపారు. ధరావత్తు చెల్లించి వేలంలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు ఇతర వివరములను ahd.aptonline.in వెబ్ సైట్ లో పొందవచ్చునని మరియు శ్రీ చేతుర్వేదుల శ్రీనాధ్ ఆఫీస్ మేనేజర్ సెల్ ఫోన్ నెంబర్ 9441281645 లో సంప్రదించి పూర్తి వివరాలు పొందవచ్చునని, కావున ఆసక్తి కలిగిన సంస్థలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవలెనని సంచాలకులు శ్రీ అమరేంద్ర కుమార్ పేర్కొన్నారు.
addComments
Post a Comment