విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి



నెల్లూరు, సెప్టెంబర్ 17 (ప్రజా అమరావతి): భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి


మాత్రమేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 

 శనివారం ఉదయం వెంకటాచలం జడ్పీ హైస్కూల్, వడ్డిపాలెం, ఎర్రగుంట మండల పరిషత్ స్కూళ్లకు సంబంధించి వెంకటాచలం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో,  వెంకటాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సుమారు రూ. 2 కోట్లతో చేపట్టనున్న నాడు నేడు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 

 ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ  నాడు నేడు పథకం రెండోవిడతలో జిల్లావ్యాప్తంగా రూ.140 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని, ఒక సర్వేపల్లి నియోజకవర్గంలోనే రూ. 29 కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్క పేద విద్యార్థికి కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, దీంతో విద్యార్థులందరూ చక్కగా క్రమం తప్పకుండా పాఠశాలలకు వచ్చి విద్యనభ్యసిస్తున్నారన్నారు. ముఖ్యంగా మానవ వనరుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, పాఠశాలలకు కావలసిన అన్ని సౌకర్యాలను సంపూర్ణంగా కల్పిస్తున్నట్లు చెప్పారు. గతంలో పాఠశాలల పరిస్థితి ఎలా ఉంది.. ప్రస్తుతం ఎలా ఉందో ఒకసారి గమనించాలని ఆయన ప్రజలకు సూచించారు. గ్రామాలకు వెళ్లినప్పుడు ప్రజలు సంక్షేమ పథకాలు అడుగుతున్నారే తప్పా, పాఠశాలల అభివృద్ధి గురించి ఏ ఒక్కరూ అడగడం లేదని, అయినా ప్రతిఒక్క పేద విద్యార్థి ఉన్నత చదువులు చదివి గొప్పగా ఎదగాలనే లక్ష్యంతో విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సకల వసతులను వినియోగించుకొని ప్రతి ఒక్క విద్యార్థి తమ పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. 

 ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసి శ్రీమతి ఉషారాణి, ఆర్ఐఓ శ్రీ వర ప్రసాద్, ఆర్డిఓ శ్రీ మలోల, ఎంపీడీవో శ్రీమతి సుస్మిత, తాసిల్దార్ నాగరాజు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ దీనదయాల్, జడ్పీ, మండల పరిషత్ పాఠశాల హెచ్ఎంలు లత, పద్మావతి, కౌసల్య, స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. 


Comments