ఏదైనా చేయాలన్న తపన, చిత్తశుద్ధి ఉంటే పనులు జరుగుతాయి. డ్రామాలు చేస్తే చివరకు గ్రాఫిక్స్‌ మాత్రమే మిగులుతాయి.

 అసెంబ్లీ (ప్రజా అమరావతి);


*రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణపై శాసనసభలో మధ్యాహ్నం చర్చ:*

*ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌:*ఇదే విజయవాడ బాగు పడాలని చెప్పి రూ.100 కోట్లు ఇచ్చి, విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పనులు కూడా చేయించడం జరుగుతోంది. ఇదే విజయవాడ నదికి ఆనుకుని ఉన్న ప్రజలు ఎప్పుడు వర్షాలు వచ్చినా, మూడు, నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి మొత్తం కృష్ణలంక ప్రాంతం మునిగిపోయేది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ పెద్ద మనిషి ఏనాడూ పట్టించుకోలేదు. అక్కడ రీటెయినింగ్‌ వాల్‌ కట్టడం కోసం రూ.137 కోట్లతో దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల వాల్‌ పూర్తి చేశాం. నదికి అటువైపు మరో కిలోమీటర్‌ మేరకు రీటెయినింగ్‌ వాల్‌ పనులకు టెండర్ల ప్రక్రియ మొదలైంది. దీనివల్ల అక్కడ.. ప్రకాశం బ్యారేజీలో ఈ స్థాయిలో వరదలు వచ్చినా ప్రజలు సంతోషంగా ఉన్నారు.

ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదే పెద్దమనిషి చంద్రబాబుగారు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కరకట్ట రోడ్డు.

కరకట్టకు ఇటువైపున ఆయన నివాసం. ఉండకూడని ప్రదేశంలో

ఆయన ఉంటున్నాడు. అది వేరే విషయం. అదే కరకట్టకు ఇంకోవైపు ఆశ్చర్యం. ఒకవైపు వాహనం వస్తే, మరో వెహికిల్‌ పోవడం కష్టం. కానీ ఈ పెద్దమనిషి కనీసం 5 ఏళ్లు ఆ రోడ్డును వెడల్పు చేయలేదు. కనీసం ఆ పనులు కూడా మొదలు పెట్టలేదు.

రూ.150 కోట్లు ఇచ్చి మనం ఆ పనులు మొదలు పెట్టాం. ఇదే విజయవాడలో బందరు రోడ్‌లో అంబేడ్కర్‌ పార్క్‌. రూ.260 కోట్ల వ్యయంతో విజయవాడ ప్రజలు ఆహ్లాదంగా గడిపేందుకు, సాయంత్రం వాకింగ్‌ చేయడం కోసం పార్క్‌ నిర్మిస్తున్నాం. వేగంగా పనులు జరుగుతున్నాయి. ఏప్రిల్‌ నాటికి పూర్తవుతాయి.

ఇదే విజయవాడలో కనకదుర్గమ్మ గుడి. ఆ తల్లి చల్లని దీవెనలతోనే మనం క్షేమంగా ఉన్నాం. కానీ ఏ రోజైనా కానీ ఆ గుడిని అభివృద్ది చేయాలని ఆ పెద్దమనిషి ఆలోచన చేయలేదు. అదే మన ప్రభుత్వం ఆ గుడి కోసం రూ.70 కోట్లు ఇచ్చింది. అదే చంద్రబాబు తన హయాంలో 40 గుడులు కూల్చేశాడు.


ఏదైనా చేయాలన్న తపన, చిత్తశుద్ధి ఉంటే పనులు జరుగుతాయి. డ్రామాలు చేస్తే చివరకు గ్రాఫిక్స్‌ మాత్రమే మిగులుతాయి.

వికేంద్రీకరణ అనేది ఒక అవసరం. రాజధానులకు మాత్రమే కాదు. పరిపాలన అనేది మారుమూల గ్రామాలకు సైతం ఎఫెక్టివ్‌గా అందాలంటే వికేంద్రీకరణ అవసరం.

వికేంద్రీకరణ, పరిపాలన సంస్కరణల విషయంలో మనందరి ప్రభుత్వం ఎలా ముందుకు అడుగులు వేసిందో చెబుతాను.


మూడేళ్ల క్రితం రాష్ట్రంలో గ్రామ సచివాలయాలు ఉంటాయా? ఎలా ఉంటాయి? వాటి వల్ల ఎలా మేలు జరుగుతుంది? అని అనుకున్నారు. కానీ ఈరోజు అన్నీ కనిపిస్తున్నాయి. మూడేళ్ల క్రితం ఎవరైనా ఊహించారా? చంద్రబాబునాయుడు 14 ఏళ్లు సీఎం అంటాడు. గతంలో 5 ఏళ్లు పరిపాలన చేశాడు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు. కానీ ఆయన కనీసం ఏనాడైనా ఊహించాడా? గవర్నెన్స్‌ను ఈ మాదిరిగా ఇంప్రూవ్‌ చేయగలుగుతాం. వ్యవస్థలో అవినీతి లేకుండా చేయగలుగుతాం. వివక్ష లేకుండా మంచి చేయగలుగుతాం. ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం ఏర్పాటు చేసి, మన పిల్లలు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి, అక్కడే కూర్చోబెట్టి, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ ఉండి, ప్రతి మనిషి, ప్రతి కుటుంబానికి సేవలందించమని ఏ రోజైనా ఆయన ఆలోచన చేశాడా?


మూడేళ్ల క్రితం రాష్ట్రంలో గ్రామ సచివాలయాలు లేవు. ఇవాళ ఏకంగా 15,004 సచివాలయాలు ఉన్నాయి. ఒక్కో సచివాలయంలో దాదాపు 600 రకాల సేవలందిస్తున్నాం. ప్రతి 2 వేల మందికి ఒక సచివాలయం. వాటిలో దాదాపు 1.20 లక్షల మన పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. ఇక్కడ ఒక సంతోషకరమైన విషయం ఆ 1.20 లక్షల ఉద్యోగుల్లో 83 శాతం నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు. నా చెల్లెమ్మలు. నా తమ్ముళ్లు. ఈ విషయం సంతోషంగా చెబుతున్నాను. వికేంద్రీకరణ అంటే ఇది.

మూడేళ్ల క్రితం గ్రామ వలంటీర్ల వ్యవస్థను ఎఫెక్టివ్‌గా తేగలుగుతాం. అవినీతికి తావు లేకుండా చేయగలుగుతాం. వివక్ష లేకుండా సేవలందించగలుగుతాం అని ఈ చంద్రబాబునాయుడు బుర్రకు కనీసం ఏరోజైనా తట్టిందా?

ఇవాళ 2.70 లక్షల గ్రామ వలంటీర్లు రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో కూడా సేవలందిస్తున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ శహభాష్‌ అనే విధంగా సేవలందిస్తున్నారు.

వికేంద్రీకరణ అంటే ఇది. ప్రతి నెలా ఒకటవ తేదీన సూర్యోదయానికి ముందే ఇంటి తలుపు తట్టి, సామాజిక పెన్షన్‌ ఇస్తున్నారు. ఇది చంద్రబాబుకు ఏనాడైనా తట్టిందా?

రేషన్‌ సరుకు. ఇంటి వద్దే డోర్‌ డెలివరీ చేస్తున్నాం. ఏమన్నా అంటే 14 ఏళ్లు సీఎం అంటాడు. చంద్రబాబుకు ఇది ఏనాడైనా తట్టిందా? ఇది వికేంద్రీకరణ అంటే.

గ్రామ సచివాలయంలో ఏ సర్టిఫికెట్‌ కావాలన్నా, కచ్చితంగా గడువు పెట్టి, అది ఇచ్చే మెకానిజమ్‌ పెట్టాం. ఇది ఆ పెద్దమనిషికి కనీస ఏ రోజైనా తట్టిందా? వికేంద్రీకరణ అంటే ఇది.

ఇక రైతు భరోసా కేంద్రాలు. ఈ కాన్సెప్ట్‌ ఆ పెద్దమనిషికి కనీసం ఏనాడైనా తట్టిందా.

ఇవాళ రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలు విత్తనం మొదలు పంటల అమ్మకం వరకు రైతుల చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. ఇది వికేంద్రీకరణ అంటే.

వ్యవసాయ శాఖ కార్యాలయం రాజధానిలో ఉంటుంది. అందుకే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తే, అక్కడ స్థలాల రేట్లు పడిపోతాయని ఎవరైనా ఉద్యమం చేస్తే ఎలా ఉంటుంది? ఇవాళ వారు చేస్తోంది అదే!

అన్నీ ఇక్కడే ఉండాలి. అన్నీ ఇక్కడికే రావాలి. రాజధానిలో భూముల రేట్లు పెరగాలి. అదే వారి ఉద్దేశం.


వికేంద్రీకరణలో భాగంగా ప్రతి గ్రామంలో డిజిటల్‌ లైబ్రరీలు, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్, విలేజ్‌ క్లినిక్‌లు ఇవన్నీ కూడా మన గ్రామంలనే అమలుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. వికేంద్రీకరణ అంటే ఇది.

ఇటీవలే నేను పులివెందులలోని వేల్పుల వద్ద సచివాలయ భవనాన్ని ప్రారంభించాను. అక్కడ డిజిటల్‌ లైబ్రరీ ఉంది. 30 మంది పిల్లలు అక్కడ పని చేస్తున్నారు. హైబ్యాండ్‌విడ్త్‌తో అక్కడ ఇంటర్నెట్‌ ఉంది. వికేంద్రీకరణ అంటే ఇది. ఆ పెద్దమనిషికి కనీసం ఏనాడైనా తట్టిందా?

గత 75 ఏళ్లలో కేవలం 2 జిల్లాలు మాత్రమే ఏర్పాటు చేస్తే, వికేంద్రీకరణకు అర్ధం చెబుతూ, 13 జిల్లాలను 26 జిల్లాలు చేశాం. 51 రెవెన్యూ డివిజన్లను 75కు పెంచాం. అదే విధంగా 91 పోలీస్‌ డివిజన్లు ఉంటే వాటిని 103కు పెంచి వికేంద్రీకరణకు అర్ధం చెప్పాం.


చివరకు కుప్పంలో రెవెన్యూ డివిజన్‌ పెట్టమని చంద్రబాబుగారు నాకు లేఖ రాశారు. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లు ఏం గాడిదలు కాశాడో తెలియదు. కుప్పంలో ప్రజలు ఒత్తిడి చేస్తే, ఈరోజు నన్ను అడగక తప్పని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. 14 ఏళ్లు సీఎం. 40 ఏళ్ల ఇండస్ట్రీ. అది ఆయన పని. ఇది నిజమైన వికేంద్రీకరణ.

పరిపాలన వికేంద్రీకరణ ఏ విధంగా ఫలితాలనిస్తోంది అన్నది మొన్నటి గోదావరి వరదల్లో చూశాం. గత 40 ఏళ్లలో ఏనాడూ ఆ స్థాయిలో వరదలు రాలేదు. కేవలం వికేంద్రీకరణ వల్లనే వరదల్లో బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు అందాయి. అలాగే ప్రతి కుటుంబానికి రూ.2 వేలు ముట్టాయి. అందుకే ఒక్కరు కూడా తమకు అవి అందలేదని చెప్పలేదు. అది వికేంద్రీకరణ అంటే.


కోవిడ్‌ సమయంలో కూడా మన వలంటీర్ల సేవలు అద్భుతం. మొన్న గోదావరి వరదల్లో కూడా వలంటీర్లు కట్టల వద్ద నిఘా వేసి, ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు.

గతంలో గోదావరికి వరదలు వస్తే, కేవలం ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు ఎస్పీలు మాత్రమే. కానీ మొన్న ఏకంగా ఆరుగురు కలెక్టర్లు. ఆరుగురు ఎస్పీలు. ఇంకా సచివాలయాల సిబ్బంది. మొత్తం 30 వేల మంది సైనికుల్లా పని చేశారు.

మన రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 11 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండగా, మరో 16 కాలేజీలు వికేంద్రీకరణలో రానున్నాయి. పార్వతీపురంలో మరో మెడికల్‌ కాలేజీ కూడా రానుంది.


మన రాష్ట్రంలో టయర్‌–1 సిటీలు లేవు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు లేవు. అందుకే ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. ఆ విధంగా ఏకంగా 17 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం. అప్పుడు సూపర్‌ స్పెషాలిటీ వైద్య నిపుణులు వస్తారు.

అందుకే నేను గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలో ఉంటున్న మూడేళ్ల ఉంచి ప్రతిసారి వికేంద్రీకరణ గురించే మాట్లాడాను. ఇంకా చెప్పాలంటే శ్రీబాగ్‌ ఒప్పందం మొదలు శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణ కమిటీ, బోస్టన్‌ గ్రూప్, ఎక్స్‌పర్ట్స్‌ గ్రూప్‌ వరకు కూడా అందరి అభిప్రాయం ఇదే. వికేంద్రీకరణ వల్లే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. అభివృద్ధి అన్ని ప్రాంతాలకు చేరాలి.


*ఇక్కడ ఒక సామెత గుర్తుకు వస్తుంది*. ‘తిమిరి ఇసుము నుంచి తైలమ్ము తీయవచ్చు. మృగతృష్ణలో నీరు త్రావవచ్చు. కుందేటి కొమ్ము సాధించవచ్చు. మూర్ఖుని మనసు రంజింప శక్యమేనా’.. ఇది అన్నది భర్తృహరి.  ఆయన సుభాషితం. దీని అర్ధం. ఇసుక నుంచి నూనె తీయొచ్చు. ఎండమావిలో నీరు తాగొచ్చు. కుందేటి కొమ్ము సాధించవచ్చు కానీ.. చంద్రబాబు వంటి వాణ్ని, ఈ దుష్ట చతుష్టయాన్ని ఈ మూర్ఖత్వం నుంచి ఒప్పించడం మాత్రం ఎవరి వల్లా కాదని.

వికేంద్రీకరణ వల్ల ఇంత మంచి జరుగుతుంటే, ఇంత మంచి కనపడుతుంటే, దీన్ని కూడా డ్రమటైజ్‌ చేసి, వక్రీకరించి, అబద్ధాలు జోడించి, ప్రాంతాల మధ్య భావోద్వేగాలు పెంచుతున్నారు.

అసలు ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు వెళ్తున్నారో తెలియదు. ఉత్తరాంధ్రకు వెళ్లి, అక్కడి దేవుడిని ఏమని మొక్కుతారు. అభివృద్ధి అంతా ఇక్కడే ఉండాలని, అక్కడి, ఆ ప్రాంత దేవుడిని మొక్కుతారట. ఉత్తరాంధ్ర ప్రజలు ఇది చూసి గమ్ముగా ఉండాలంట. వారికి భావోద్వేగాలు ఉండవా?

మరి వాళ్లకు భావోద్వేగాలు ఉన్నప్పుడు వారిని రెచ్చగొట్టడానికి ఏకంగా ఈ మనిషి వీరందరినీ అక్కడికి పంపించడం ధర్మమేనా? అంటే వారు వారు కొట్టుకోవాలి.


ఈ పెద్దమనిషికి బాగా తెలుసు. ఆయనకు గతంలో 23 సీట్లు వచ్చాయి. ఇప్పుడు కుప్పం కూడా పోతుంది. ఏ సీట్లు రావు. అందుకే పెట్రోల్‌ పోసి భావోద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. నారా హమారా అంటూ.. యాత్రలు మొదలు పెట్టించి, రాజకీయాల కోసం దిక్కుమాలిన పని చేస్తున్నాడు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లాభం పొందాలని చూస్తున్నాడు. అంత నీచమైన స్థాయికి ఏ నాయకుడూ పోడు.

కేవలం చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5. అందరూ కలిసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. వీరంతా పోతే తప్ప, రాష్ట్రం బాగుండదు. వారు పోతే ప్రజలంతా సంతోష పడతారు.

ఇక్కడ ఒక సేయింగ్‌ గుర్తుకు వస్తోంది. ‘నేను మాత్రమే బాగుండాలంటే అది స్వార్థం. అందరం బాగుండాలంటే అది ఒక సమాజం’.

మనం తీసుకొస్తున్న సంస్కరణలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు సమాజంలో కనీసం 90 శాతం ప్రజలకు మేలు చేస్తున్నాయి. గ్రామ సచివాలయం మొదలు, రాష్ట్ర స్థాయి వరకు మన ఎజెండా ఒక్కటే. ఇంటింటికీ, ప్రతి మనిషికి మేలు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాం.

నేను మరోసారి ఈ విషయం స్పష్టం చేస్తున్నాను. నేను ఈ ప్రాంతానికి వ్యతిరేకం కాను. అందుకే మూడు రాజధానుల్లో ఒకటి ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను.

నాటి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలలోని 33 నియోజకవర్గాలలో మన పార్టీ 29 ఎమ్మెల్యే సీట్లు గెలుపొందింది. మంచి చేస్తున్నాం కాబట్టే, 2019 ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో మన పార్టీ పూర్తి స్వీప్‌ చేసింది. ఇది కేవలం కృష్ణా, గుంటూరు జిల్లాలలోనే కాదు. రాష్ట్రమంతా అవే ఫలితాలు వచ్చాయి.

ఎంపీటీసీ ఎన్నికల్లో 86 శాతం.. 8,298 చోట్ల వైయస్సార్‌సీపీ గెల్చింది. ఎంపీపీలు 637 వైయస్సార్‌సీపీకి అంటే 98 శాతం వచ్చాయి, జడ్పీటీసీలు 639 వైయస్సార్‌సీపీకి అంటే 98 శాతం వచ్చాయి. జడ్పీ ఛైర్మన్లు మొత్తం 13 గెల్చుకుంది. అది 100 శాతం. 14 మున్సిపల్‌ కార్పొరేషన్లలో 100 శాతం గెల్చాం. మున్సిపాలిటీలు 86 చోట్ల పోటీ జరిగితే 84 చోట్ల వైయస్సార్‌సీపీ గెల్చింది.

ఇలా ప్రతి అడుగులో కూడా వికేంద్రీకరణ ఒక మంత్రంగా, అభివృద్ధి అనేది ప్రతి ఇల్లు, ప్రతి మనిషికి అందేలా పారదర్శకంగా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తూ, అలా చేయగలమా? ఇవ్వగలమా? అని మేధావులకూ సందేహం వచ్చే పరిస్థితుల్లో.. దేవుడి దయతో దాన్ని సాకారం చేసి చూపాం.


ఇలానే ప్రజలు దీవించాలని, దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ, ఈరోజు ఈ చర్చ వల్ల కనీసం చంద్రబాబుకు, ఆయన పార్టీకి, ఆయనను మోస్తున్న దుష్ట చతుష్టయానికి జ్ఞానోదయం కావాలని, తద్వారా అయినా కనీసం వారు ప్రోత్సహిస్తున్న ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడాన్ని ఆపుతారని ఆశిస్తూ.. సెలవు తీసుకుంటున్నాను.

Comments