వెట్ ల్యాండ్ బోర్డ్ ఆధ్వ‌ర్యంలో చిత్త‌డి నేల‌ల సంర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు




- చిత్త‌డి నేల‌ల సంర‌క్ష‌ణ‌పై స‌చివాల‌యంలో తొలి స‌మావేశం

- అట‌వీశాఖ అధికారుల‌తో మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి స‌మీక్ష‌

- వెట్ ల్యాండ్ బోర్డ్ ఆధ్వ‌ర్యంలో చిత్త‌డి నేల‌ల సంర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు


- రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల ఎకరాల్లో వెట్ ల్యాండ్ గుర్తింపు

- ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకునేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు

- చిత్త‌డినేల‌ల్లో వ‌న్య‌ప్రాణులు, ప‌క్షులు, జీవ‌జాలం సంర‌క్ష‌ణ పై దృష్టి

- రెవెన్యూ, అగ్రిక‌ల్చ‌ర్, అట‌వీశాఖ అధికారుల‌తో క‌మిటీ ఏర్పాటు

- రెండు నెల‌ల్లో వెట్ ల్యాండ్ పై ప్రాథ‌మిక నివేదిక‌


: మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి


అమ‌రావ‌తి (ప్రజా అమరావతి): 


ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అరుదైన జీవజాలంకు ఆల‌వాలంగా ఉన్న చిత్త‌డి నేల‌ల ప‌రిర‌క్ష‌ణ‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, ఇంధ‌న‌, సైన్స్ అండ్ టెక్నాల‌జీ, గ‌నుల‌శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అట‌వీ అధికారుల‌ను ఆదేశించారు. అమ‌రావ‌తిలోని స‌చివాలయంలో బుధ‌వారం అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌శాఖ అధికారుల‌తో వెట్ ల్యాండ్ బోర్డ్ తొలి స‌మావేశం మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అధ్య‌క్ష‌త‌న జరిగింది. 


ఈ స‌మావేశంలో మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలోని చిత్త‌డినేల‌ల్లో జీవ వైవిధ్యాన్ని ప్ర‌తిభింబిస్తూ అనేక ర‌కాల జంతువులు, ప‌క్షులు, జీవ‌జాలం మ‌నుగ‌డ‌ను సాగిస్తున్నాయ‌ని అన్నారు. కొల్లేరు, నేల‌ప‌ట్టు, పులికాట్, కొరింగ‌, శ్రీ‌కాకుళంలోని ప‌లు ప్రాంతాల్లో చిత్త‌డి నేల‌లు ఉన్నాయ‌ని అన్నారు. కొల్లేరు, పులికాట్ ప్రాంతంలోని చిత్త‌డి నేల‌ల్లో అరుదైన విదేశీ ప‌క్షులు వేల కిలోమీట‌ర్ల మేర ప్ర‌యాణం చేసి, ఈ ప్రాంతంలో త‌మ సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాయ‌ని తెలిపారు. వీటితో పాటు అంత‌రించుపోతున్న ప‌లు జంతువులు, జీవ‌జాలాలు చిత్త‌డి నేల‌ల్లో ప్ర‌కృతి ఒడిలో మ‌నుగ‌డ సాగిస్తున్నాయ‌ని అన్నారు. ఇటువంటి చిత్త‌డి నేల‌ల‌ను కాపాడుకోవాల‌ని ఇరాన్ లోని రామ్ స‌ర్ లో జాతీయ క‌న్వెన్స‌న్ జ‌రిగింద‌ని, ఇందులో ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాలు పాల్గొని ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌, జీవివైవిధ్యంను కాపాడుకునేందుకు తాము కూడా భాగ‌స్వాములు అవుతామ‌ని స్ప‌ష్టం చేశాయ‌ని గుర్తు చేశారు. చిత్త‌డి నేల‌ల ప‌రిర‌క్ష‌ణ‌పై 2019, 2017లో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చ‌ట్టాలు చేసింద‌ని తెలిపారు. వాటి ఆధారంగా రాష్ట్రంలోనూ వెట్ ల్యాండ్ బోర్డ్ ఏర్పాట‌య్యింద‌ని, అయితే ఈ బోర్డ్ స‌మావేశాలు గ‌తంలో జ‌ర‌గ‌లేద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం నిర్వ‌హించిన‌ తొలి స‌మావేశం సంద‌ర్బంగా అట‌వీశాఖ అధికారులు చిత్త‌డి నేల‌ల సంర‌క్ష‌ణ‌పై ప్ర‌త్య‌క దృష్టి సారించాల‌ని కోరుతున్న‌ట్లు తెలిపారు. 


కేంద్ర‌ప్ర‌భుత్వం మ‌న రాష్ట్రంలో మొత్తం 30వేల ఎక‌రాల్లో చిత్త‌డి నేల‌లు ఉన్న‌ట్లు గుర్తించింద‌ని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి తెలిపారు. వివిధ జిల్లాల్లో విస్త‌రించి ఉన్న ఈ నేల‌ల్లో కొంత మేర ఆక్ర‌మ‌ణ‌లు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంద‌ని అన్నారు. కొల్లేరు ప్రాంతంలో 5 నుంచి 2 వ కాంటూరు వ‌ర‌కు చేప‌ల చెరువులు విస్త‌రించాయ‌ని అన్నారు. మ‌రికొన్ని ప్రాంతాల్లో సీజ‌న‌ల్ గా వ్య‌వ‌సాయం, ఇత‌ర పంట‌లు సాగు చేస్తున్నారని తెలిపారు. వీట‌న్నింటిపైన నిర్ధిష్ట‌మైన స‌మాచారం రూపొందించేందుకు రెవెన్యూ, వ్య‌వ‌సాయం, అట‌వీశాఖ అధికారుల‌తో క‌మిటీ ఏర్పాటు చేస్తున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.  రెండు నెల‌ల్లో ఈ క‌మిటీ ప్రాథ‌మిక నివేదిక‌ను వెట్ ల్యాండ్ బోర్డ్ కు స‌మ‌ర్పిస్తుంద‌ని తెలిపారు. అటు ప్ర‌జ‌ల జీవ‌నోపాధుల‌కు విఘాతం లేకుండా, ఇటు చిత్త‌డి నేలల్లో జీవ‌జాలం మ‌నుగ‌డ‌కు ముప్పు లేకుండా వెట్ ల్యాండ్ బోర్డ్ ఆధ్వర్యంలో అవ‌సర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. 


ఈ స‌మావేశంలో అట‌వీశాఖ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్, అట‌వీద‌ళాల అధిప‌తి మ‌ధుసూధ‌న్ రెడ్డి, పిసిపిఎఫ్ ఎకె ఝా, స్పెష‌ల్ క‌మిష‌న‌ర్ శాంతిపాండే త‌దిత‌రులు పాల్గొన్నారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image