మహోన్నత మహిళకు వెలుగైన ఫూలే 'సత్యశోధక్ సమాజ్'

 మహోన్నత మహిళకు వెలుగైన ఫూలే 'సత్యశోధక్ సమాజ్'



- సమాజ్ స్థాపనకు రేపటికి 150 ఏళ్లు

- మహిళా కమిషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి వేదికగా ఆవిర్భావ దినోత్సవం


మహిళలకు విద్య, సాంఘిక హక్కులు, రాజకీయ చైతన్యం కలిగించడమే ముఖ్య ఉద్దేశంగా మహాత్మ జ్యోతిబా ఫూలే 150 ఏళ్ళ కిందట మహత్తర సంకల్పం చేశారు. "సత్యశోధక్ సమాజ్" సంస్థను స్థాపించి మహిళను మహోన్నతంగా తీర్చిదిద్దేందుకు దోహదపడ్డారు. నేడు మహిళను అన్నింటా ముందుంచిన రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు .. నాడు ఫూలే స్థాపించిన "సత్యశోధక్ సమాజ్" ఆదర్శమని చెప్పాలి. అందుకే, రాష్ట్రంలో మహిళా సంక్షేమం, భద్రత, రక్షణ ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని 'అభినవ ఫూలే' గా పలువురు అభివర్ణిస్తారు. మహాత్మ జ్యోతిరావు ఫూలే 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక సమాజ్ సంస్థను స్థాపించగా.. శనివారంతో 150 ఏళ్లు అవుతున్నందున.. దీనిని పురస్కరించుకొని ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రాష్ట్ర మహిళా కమిషన్ పూనుకుంది. రాజమండ్రిలో ఆనం కళాకేంద్రం వేదికగా వేడులకు ఏర్పాట్లు చేసింది. మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇప్పటికే వివిధరంగాల నుంచి మేధావులు, మహిళా ప్రతినిధులకు ఆహ్వానం పలికారు. మహాత్మ జ్యోతిబా ఫూలే, ఆయన సతీమణి సావిత్రీబాయి ఫూలే వంటి సంఘసంస్కర్తల ఆశయాలు, లక్ష్యాలు ఈనాటికి ఏమేరకు నెరవేరాయనే అర్ధవంతమైన చర్చ ఈ వేదికగా ప్రపంచానికి తెలియపరుస్తామంటున్నారు వాసిరెడ్డి పద్మ.

ఈ సందర్భంగా ఫూలే "సత్యశోధక్ సమాజ్" స్థాపన చరిత్ర తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. 


చరిత్ర ఇది..

సత్యశోధక్ సమాజ్ అనేది మహాత్మా జ్యోతిబా ఫూలే మహారాష్ట్రలోని పూణేలో 1873 సెప్టెంబరు 24లో స్థాపించిన సాంఘిక సంస్కరణ సమాజం. అణగారిన వర్గాల వారికి, శూద్రులకు, దళితులకు, ముఖ్యంగా మహిళలకు విద్య, సాంఘిక హక్కులు, రాజకీయ చైతన్యం కలిగించడమే లక్ష్యంగా పనిచేసింది. అప్పట్లో సత్యశోధక్ సమాజ్ లో సభ్యత్వానికి ఉన్నత వర్గాలకు  ఉన్నతాదాయ వర్గాల వారికి అనుమతినివ్వలేదు. ఈ సమాజంలో అణగారిన వర్గాల వారికి మాత్రమే సభ్యత్వమంటూ.. కుల వ్యవస్థ, అశాస్త్రీయ, సనాతన పద్ధతులకు వ్యతిరేకంగా జ్యోతిబా ఫూలే పనిచేశారు. మత పుస్తకాల్లోని అసమానత,  దురాచారాలకు వ్యతిరేకంగా రచనలు చేశారు. మానవ శ్రేయస్సు, ఆనందం, ఐక్యత, సమానత్వం, ఆచారాలు వంటి కొన్ని ఆలోచనలను మనస్సులో ఉంచుకుని,  ఫూలే 'దీన బంధు' అనే వార్తాపత్రికను ప్రారంభించి, తన అభిప్రాయాల్ని వెల్లడించారు. దేవుని దూతగా భావించిన కొన్నివర్గాలను సత్యశోధక్ సమాజం  విశ్వసింపక, అప్పట్లో వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకించింది. ఉపనిషత్తులు, వేద సంస్కృతిలో ఉన్నటువంటి మూఢాచార భావజాలాన్ని నమ్మలేదు. ఆర్యన్ సమాజాన్ని గౌరవించడాన్ని వీరు తిరస్కరించారు. ప్రధానంగా ఆయా భావాజాలాల ప్రకారం మహిళ హింసకు గురికావడం, ఇంటి నాలుగు గోడల నడుమ వెట్టిచాకిరికి బలవడం, అక్షరాస్యతకు నోచుకోకపోవడాన్ని, హక్కుల్ని కాలరాయడాన్ని సత్యశోధక్ సమాజం జీర్ణించుకోలేక తిరగబడింది. ఫలితంగా, ఫూలే ఆశించిన సంఘ సంస్కరణలు క్షేత్రస్థాయిలో కనిపించాయి. మహాత్మ ఫూలే సత్య శోదక్ సమాజ్ మొదటి అధ్యక్షుడిగా, కోశాధికారిగా పనిచేసి సమాజంలో చాతుర్వర్ణ వ్యవస్థను (కుల వ్యవస్థ) ఖండించారు. 


నాటి సంస్కరణల ఆదర్శంగా..

--------------

మహిళలను గౌరవించి వారికి అన్నింటా సమభాగం కల్పించడంలో నేడు 

ప్రభుత్వానికి ఫూలే ఆదర్శమని చెప్పాలి. చరిత్రకారుల లక్ష్యాలు, సిద్ధాంతాలను అర్ధం చేసుకుని పరిపాలనలో సంస్కరణలు తేవడం హర్షించదగ్గ విషయం. ఆ దిశగా ముఖ్యమంత్రి జగన్ మహిళల ఆదరణను అనతికాలంలోనే సంపాదించుకున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదని మేధావులు అంటున్నారు. ఉన్నతవర్గాల ఆధిపత్యాన్ని పొడచూపని విధంగా పేదింట విద్యాకుసుమాలు విరబూయాలని 'నాడు - నేడు' పథకంతో విజయవంతం అయ్యింది.

మహిళలకు విద్యావకాశాలు, వయోజన విద‍్య కోసం కృషిచేసిన ఫూలే జీవిత చరమాంకం వరకు బలహీన వర్గాలకోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి. కాగా, ఆయన బాటలో బలహీన వర్గాల కోసం రూ.5వేల కోట్లకు పైగా నిధులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఖర్చుచేస్తుంది. మహిళకు సామాజిక, ఆర్ధిక సాధికారతతో పాటు రాజకీయ సాధికారత కూడా అవసరమని గుర్తించి.. సీఎం వైఎస్‌ జగన్‌ 50శాతం రిజర్వేషన్లు తెచ్చి మరో అభినవ పూలేగా మారారని ప్రజలు కొనియాడుతున్న సందర్భాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలనే ప్రయత్నంగా నేడు ఫూలే 'సత్యశోధక్ సమాజ్' స్థాపన ఉద్దేశాన్ని 'మహిళా కమిషన్' గుర్తుచేయడం విశేషం.



Comments