జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది

 


రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి):



జిల్లాలో రానున్న రోజుల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగింద


ని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత శనివారం రాత్రి ఒక ప్రకటన లో తెలియచేశారు.



 రానున్న పది రోజుల పాటు వర్షపాతం నమోదు అయ్యే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా, రెవెన్యూ డివిజన్, మండలాల పరిధిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చెయ్యాలని, తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆమె తెలిపారు. 

అధికారులు అందరూ ప్రధాన కార్యాస్థానం లో అందుబాటులో ఉండాలని, సిబ్బంది ఎవ్వరికీ సెలవులు మంజూరు చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు.


Comments