ఇంద్రకీలాద్రి: అక్టోబర్ 4 (ప్రజా అమరావతి);
శరన్నవరాత్రి మహోత్సవాల్లో 10వ రోజు బుధవారం శ్రీ కనకదుర్గాదేవి చిరునవ్వులతో శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది.
చెరుకుగడను వామహస్తముతో ధరించి దక్షిణ హస్తముతో అభయాన్ని ప్రసాదింపజేసే రూపంలో శ్రీ షోడశాక్షరీ మహామంత్ర స్వరూపిణిగా శ్రీచక్రరాజ అధిష్టానదేవతగా వెలుగొందే శ్రీరాజరాజేశ్వరి దేవిని దర్శించి, అర్చించడంవలన మనకు సర్వశుభములు కలుగును. దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని అందరికీ అందింపచేసే అపరాజితాదేవిగా, చల్లనితల్లిగా దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనం ఇస్తుంది. అమ్మను సేవించి జీవితాన్ని ధన్యం చేసుకొందాం. సకల శుభాలు, విజయాలు శ్రీ అమ్మవారి దివ్య దర్శనం ద్వారా మనకు లభిస్తాయి.
addComments
Post a Comment