నియోజక వర్గాల వారీగా మైనారిటీల కొరకు రూ.1.00 కోటి విలువైన పనులు

 *నియోజక వర్గాల వారీగా మైనారిటీల కొరకు రూ.1.00 కోటి విలువైన పనులు


*•స్థానిక శాసన సభ్యులతో సంప్రదించి తాజా ప్రతిపాదనలను పది రోజుల్లో అందజేయాలి*

*•క్రిస్మస్కు ముందే నవంబరులో  జెరూసలెం యాత్రకు పంపేందుకు జాబితాను సిద్దం చేయాలి*

*•పాస్టర్లకు గౌరవేతనం మంజూరు చేసేందుకు వచ్చే నెల 5 లోపు ధరఖాస్తులను సీకరించాలి*

*•క్రిష్టియన్, ముస్లిం ఆస్తుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలను చేపట్టాలి*

*ఉప ముఖ్యమంత్రి (మైనారిటీల సంక్షేమం) అంజాద్ భాషా షేక్ బిపారి*

                                                                                                                                                                                    అమరావతి, అక్టోబరు 28 (ప్రజా అమరావతి):  మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రతి నియోజక వర్గంలో రూ.1.00 కోటి విలువైన పనుల చేపట్టేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, అందుకు అనుగుణంగా స్థానిక శాసన సభ్యులతో సంప్రదించి తాజా ప్రతిపాదనలను సంబంధిత జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి  పదిరోజుల్లో పంపాలని ఉప ముఖ్యమంత్రి మరియు మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ భాషా షేక్ బిపారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం అమరావతి సచివాలయం మూడో బ్లాక్ సమావేశ మందిరంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులతో ఆయన సమావేశమై శాఖా పరంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మైనారిటీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో మసీదులు, చర్చిలు, షాదీఖానాలు, స్మశాన వాటికలు అభివృద్దికి అవసరమైన నిధులను ప్రభుత్వం అందజేస్తున్నదని,  మైనారిటీ శాఖ అధికారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.  రాష్ట్రం నుండి పవిత్ర జెరూసలేమ్ నగరానికి తీర్థయాత్రకు పంపేందుకు అర్హులైన వారి జాబితాను సత్వరమే ఖరారు చేయాలని, ఇందుకు సంబందించిన ప్రక్రియను సాద్యమైనంత త్వరగా పూర్తి చేస్తే వచ్చే మాసంలోనే క్రిస్మస్ కు ముందే  వారందరినీ పవిత్ర జెరూసలేమ్ నగరానికి యాత్రకు పంపేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అధికారులకు ఆయన సూచించారు.  ఇప్పటి వరకూ 5 వేలకు పైబడి ఫాస్టర్లకు ప్రభుత్వం గౌరవవేతనం అందించడం జరుగుచున్నదని, ఇంకా ఎవరన్నా అర్హులు ఉంటే వారందరి నుండి వచ్చే నెల 5 వ తేదీ లోపు ధరఖాస్తులను స్వీకరించి, అర్హులైన వారి జాబితాను సత్వరమే సిద్దం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ముస్లిం మైనారిటీల జాతీయ మండలి నుండి గ్రాంట్-ఇన్-ఎయిడ్ త్వరగా అందేలా మరియు నిరుపేద మస్లింలకు తక్కువ వడ్డీకే ఋణ సాయం అందేలా చూడాలని రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్సు కార్పొరేషన్ ఎం.డి.ని ఆదేశించారు.  ఉర్థూ భాష బలోపేతానికి తగు చర్యలు తీసుకోవాలని, ఉర్థూను అధికార భాషగా అమలు పర్చేందుకు జిల్లా కలెక్టర్లు అందరికీ తగు  ఆదేశాలు జారీచేయాలన్నారు. ఉర్థూ మీడియం పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యపెరిగేలా తగు చర్యలు చేపట్టాలన్నారు. క్రిష్టియన్, ముస్లిం ఆస్తుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలను చేపట్టాలని అధికారులకు ఆయన సూచించారు. 

                                                                                                                                                                                       రాష్ట్ర మైనారిటీల సంక్షేమ శాఖ కార్యదర్శి ఇంతియాజ్, సంచాలకులు డా.జి.సి.కిషోర్ కుమార్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ హెచ్.నదీమ్ అహ్మద్, రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్సు కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసీఫ్ భాషా, హజ్ కమిటీ చైర్మన్ ఎస్.గౌసల్ లాసమ్, ఎ.పి.స్టేట్ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అబ్దుల్ ఖాదిర్, వక్ఫ్ సర్వే కమిషనర్ షరీన్ బేగం, రాష్ట్ర ఉర్దూ అకాడమీ సంచాలకులు డా.ఎన్.ఆయూబ్ హుస్సేన్, సిఇఎండి సంచాలకులు డా. మస్తాన్ వలీ, రాష్ట్ర క్రిష్టియన్ మైనార్టీల కార్పొరేషన్ ఎం.డి. జె.ఎలీషా, కార్యదర్శి ఓ.ఎస్.డి. టి.నరసింహులు తదితరులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. 

                                                                                                                                                                                            

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image