రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి):
రైతులందరికీ ఇంకొకసారి మనవి ఈకేవైసికి ఆఖరి అక్టోబర్ 12
జిల్లాలో సాగు విస్తీర్ణం లో నూరుశాతం భూమి ఈ కేవైసి పూర్తి
- కలెక్టర్ మాధవీలత
వ్యవసాయ, ఉద్యాన శాఖల ద్వారా సాగు విస్తీర్ణం లో ఉన్న భూములు ఈక్రాప్ నమోదు ఇప్పటివరకు 100% పూర్తయినదని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
జిల్లాలో అన్ని రకాల పంటలకు సంబంధించి మూడు లక్షల 49 వేల 370 ఎకరాలు ఈక్రాప్ చేయడం జరిగినదన్నారు. జిల్లాలో వ్యవసాయ అనుబంధ భూముల్లో సాగు విస్తీర్ణం లో లేని సుమారు మరో తొమ్మిది వేల ఎకరాల ను కూడా ఈ క్రాప్ నమోదుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మొత్తం ఈక్రాఫ్ అథెంటికేషన్ సంబంధిత వ్యవసాయ సహాయకులు, గ్రామ రెవెన్యూ సహాయకులు ద్వారా 98% పూర్తి చేశారన్నారు. సాగులో లేని భూములకు చెందిన రైతులందరూ తప్పనిసరిగా ఈకేవైసీని సంబంధిత వ్యవసాయ విస్తరణ సహాయక లను ప్రత్యక్షముగా సంప్రదించి బయోమెట్రిక్ ద్వారా గాని లేదాపరోక్షంగా ఓటీపీ ద్వారా నమోదు కార్యక్రమం చేసుకోవాలన్నారు.
సంబందించిన భూములు గల రైతు ఈ కేవైసీ చేయుటకు ఆఖరి తేదీ అక్టోబర్ నెల 12వ తేదీ లోగా రైతులు అందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ద్వారా ప్రభుత్వము కల్పించే వివిధ రకాలైన లబ్ధి ,ముఖ్యముగా పంట నష్టపరిహారం, పంట బీమా, రైతు భరోసా, పంట రుణాలు మొదలగునవి వినియోగించుకోవాల్సిందిగా కోరడమైనదన్నారు.
addComments
Post a Comment