17 నుండి 42వ జాతీయ జూనియర్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ కు ఎంపిక పోటీలు

 


*17 నుండి 42వ జాతీయ జూనియర్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ కు ఎంపిక పోటీలు* 


పార్వతీపురం, అక్టోబర్ 13 (ప్రజా అమరావతి): 42వ జాతీయ జూనియర్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ కు రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు ఈ నెల 17 నుండి 19 వ తేదీ వరకు పార్వతీపురంలో జరుగుతుందని జిల్లా క్రీడల చీఫ్ కోచ్  ఎస్.వెంకటేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ జూనియర్ బాలురు, బాలికలు, ఇండియన్ రౌండ్, రికర్వ్ , కాంపౌండ్ పోటీలకు ఎంపికను పార్వతీపురంలో చేపట్టడం జరుగుతుందని ఆయన వివరించారు. అక్టోబర్ 17 నుండి 19 వరకు పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా అర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో  విజయనగరం జిల్లా అర్చరీ అసోసియేషన్, చెరుకూరి ఓల్గా అర్చరీ అకాడమీ సంయుక్తంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారని అన్నారు. ఇందులో ఎంపిక అయిన వారు నవంబర్ 3 నుండి 12 వరకు గోవాలో ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే జాతీయ పోటీలలో పాల్గొంటారని చెప్పారు. ఎఎఐ నిబంధనల మేరకు ఎంపిక పోటీలు నిర్వహించడం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. 


పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లు వెంటనే ఆధార్ కార్డ్, పుట్టిన తేదీ ధ్రువపత్రం, అర్చరీ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తో జిల్లా క్రీడల అథారిటీలో నమోదు చేసుకోవాలని అన్నారు. అర్చరీ  ఛాంపియన్ షిప్ లో పాల్గొనే క్రీడాకారులు రూ.1500 ఎంట్రీ ఫీజు చెల్లించాలని తెలిపారు. క్రీడాకారులు జనవరి 2002 తరువాత జన్మించిన వారై ఉండాలన్నారు.  అర్చరీ లో పాల్గొనే అభ్యర్థులు తప్పని సరిగా జిల్లా అర్చరీ అసోసియేషన్ లో నమోదు చేసుకొని ఉండాలని ఆయన వివరించారు. నమోదు పొందని క్రీడాకారులు రూ.500 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని తెలిపారు. జిల్లాల నుండి ప్రతి ఈవెంట్ లో 6గురు బాలురు, 6గురు బాలికలు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. 


17న ఇండియన్ రౌండ్, 18 న రికర్వ్,19న కాంపౌండ్ పోటీలకు ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎంపిక జరుగుతుందని ఆ ప్రకటనలో  వివరించారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
Shiv Nadar University Chennai inaugurated its flagship Quiz Competition - QUBIZ
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image