రాష్ట్రంలో సాదాబైనామా భూములు కలిగిన రైతులకు 2023 డిసెంబర్ లోగా పూర్తి హక్కులు



నెల్లూరు, అక్టోబర్ 20 (ప్రజా అమరావతి):  రాష్ట్రంలో సాదాబైనామా భూములు కలిగిన రైతులకు 2023 డిసెంబర్ లోగా పూర్తి హక్కులు క


ల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.


గురువారం ఉదయం దగదర్తి మండల పరిధిలోని కాట్రాయిపాడు గ్రామంలో ఆహ్లాదకర వాతావరణంలో ఒకేచోట నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైయస్సార్ హెల్త్ క్లినిక్ లను కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ఎటువంటి హక్కు పత్రాలు లేకుండా కేవలం అగ్రిమెంట్ మీద కొనుగోలు చేసిన భూమిపై రైతులు ఎలాంటి హక్కులు లేక ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారని, దీనిని గమనించిన ముఖ్యమంత్రి డిసెంబర్  2023లోగా ఎటువంటి వివాదాలు లేని సాదాబైనామా భూములు కలిగిన రైతులకు హక్కులు కల్పిస్తూ పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.  మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు చేస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మరెక్కడా కూడా లేవని, ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి మంత్రులు కూడా మన కార్యక్రమాలపట్ల ఆసక్తి కనబర్చారని, ఇదే మన ప్రభుత్వ పరిపాలనకు నిదర్శనమన్నారు. అలాగే గ్రామస్థాయిలో ప్రభుత్వ పరిపాలన అందించాలనే లక్ష్యంతో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ వంటి ప్రభుత్వ భవనాలు నిర్మించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. గతంలో పేదలకు ఇళ్ల స్థలాలు అందించడం చాలా కష్టంగా ఉండేదని, ఇప్పుడు ఒక ప్రత్యేక లేఅవుట్ ను ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు కేటాయించి మహిళల పేరుతో పట్టాలు ఇచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వాల పరిపాలనకు ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనకు తేడాను ఒకసారి ప్రజలు గమనించాలని మంత్రి కోరారు. కాట్రాయిపాడు గ్రామంలోనే ఈ మూడేళ్లలో సుమారు రెండు కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు.కావలి రైతాంగానికి సంబంధించి త్వరలోనే బైపాస్ కెనాల్ పనులు కూడా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. 

 కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించడమే లక్ష్యంగా సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాలు కూడా మెచ్చుకునే విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఏ గడపకు వెళ్లిన ప్రజలు తమకు నీరాజనాలు పలుకుతున్నారని, ప్రతి ఇంటికి జగనన్న అందించిన సంక్షేమ పథకాల లబ్ది చేకూరడమే దీనికి కారణమన్నారు. కావలి నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో పయనిస్తోందని, ఒకపక్క రామాయపట్నం పోర్టు పనులు మొదలయ్యాయని, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పూర్తి కావచ్చిందని, దగదర్తి మండలాన్ని ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. 

 తొలుత గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తో కలిసి మంత్రి ప్రారంభించారు. 

 ఈ కార్యక్రమంలో  జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ సుధాకర్ రాజు, పశుసంవర్ధక శాఖ జెడి శ్రీ మహేశ్వరుడు, కావలి ఆర్డిఓ శ్రీ శీనా నాయక్, డివిజనల్ డెవలప్మెంట్ అధికారి శ్రీమతి కనక దుర్గాభవాని, దగదర్తి మండల ఎంపీపీ శ్రీ తాళ్లూరు వెంకట కృష్ణ ప్రసాద్ నాయుడు, జడ్పిటిసి తాళ్లూరు స్వరూపరాణి, సర్పంచ్ ఎల్వీ ప్రసాద్ నాయుడు, మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 


Comments