జిల్లాలో మరో 25 రోజుల్లో జగనన్న పాల వెల్లువ అమలు: అహ్మద్ బాబు
తిరుపతి అక్టోబర్ 8 (ప్రజా అమరావతి): జిల్లాలో జగనన్న పాలవెల్లువ పథకాన్ని మారో 25 రోజుల్లో అమలు చేయడానికి జిల్లా యంత్రాంగం సిద్ధం కావాలని ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ప్రత్యేక అధికారి మరియు కమిషనర్ రిజిస్టర్ కోపరేటివ్ సొసైటీ అహ్మద్ బాబు అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లో జగనన్న పాలవెల్లువ అమలుపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ కె వెంకట రమణ రెడ్డి, కమిషనర్ మరియు రిజిస్టర్ కోపరేటివ్ సొసైటీ , డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ స్పెషల్ ఆఫీసర్, అమూల్ సంస్థ ప్రతినిధులు జిల్లాలో పాల సేకరణ పై చేపట్టాల్సిన చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
అహ్మద్ బాబు మాట్లాడుతూ అమూల్ సంస్థ పూర్తిగా రైతులకు సంబంధించిన కోపరేటివ్ సొసైటీ అని పాల సేకరణతో వచ్చే మొత్తాన్ని ఈ సంస్థ 85% రైతులకు చెల్లించి 15శాతం సొసైటీ నిర్వహణకు ఉపయోగిస్తారని, 75 సంవత్సరాల చరిత్ర గల సంస్థ అని అన్నారు. చిత్తూరు జిల్లాలో పాల సేకరణ ఇప్పటికే జరుగుతుందని పాడి రైతులకు అధిక ఆదాయం లక్ష్యంగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. తిరుపతి జిల్లాలో ప్రారంభించడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని మొదటి దశలో 3 మండలాలలో నారాయణవనం పుత్తూరు వడమాలపేటలో ప్రారంభించనున్నామని , ఈ మండలాలకు సంబంధించిన అన్ని గ్రామాలలో మహిళా రైతు సహకార సంఘాలు ఏర్పాటు కావాలని సూచించారు. జగనన్న పాలవెల్లువ నిర్వహణ మహిళ పాడి రైతుల దేనని ఇందుకోసం ఒక్కొక్క సొసైటీకి 8 నుండి 11 మంది సభ్యులు ఉండేలా ఏర్పాటు కావాలని అన్నారు. మొదటి విడతలో గుర్తించిన 100 పాల సేకరణ కేంద్రాలలో పూర్తిస్థాయిలో కంప్యూటర్ పరికరాలు అందుబాటులోకి రానున్నాయని, కేంద్రాలలో పాలు పోసే మహిళ పాడి రైతులకు ప్రత్యేక గుర్తింపు ఐడి వస్తుందని , ఐడి మేరకు చెల్లింపులు నేరుగా మహిళా రైతుల బ్యాంకు ఖాతాల కె చెల్లింపు జరుగుతుందని అన్నారు. పాలు పోసే ప్రతిసారి రైతుల ఫోన్ నెంబర్లకు లీటరు అందిస్తున్న మొత్తాన్ని తెలియజేసే మెసేజ్ లు అందుతాయని పది రోజులకు ఒకసారి చెల్లింపులు జరుగుతాయి వివరించారు. కనీసం లీటర్లకు 10 నుండి 20 రూపాయలు అధిక ఆదాయం వస్తుందని లెక్కలు చెబుతున్నాయి అని అన్నారు. సచివాలయ వాలెంటర్ల్లు తమ పరిధిలో పశువుల కలిగిన మహిళా రైతులను కంప్యూటర్ నందు నమోదు చేయాల్సి ఉంటుందని, అప్పుడే పాలు పోయడానికి వారికి 8 అంకెల ఐడి నెంబర్ ఏర్పాటవుతుందని ఇది దేశవ్యాప్తంగా వర్తిస్తుందని అన్నారు. జగనన్న పాలవెల్లువ పథకానికి సంబంధించి అమలు చేయు విధానం పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హాజరైన అధికారులకు సిబ్బందికి వివరించారు. మహిళల ఆర్థిక అభివృద్ధి పెంచడానికి జగనన్న తోడు మొత్తం కూడా మహిళా రైతులకు పాల వల్ల కలిగే లాభాలను వివరించాలని, డి సి సి బి బ్యాంక్ తప్పనిసరిగా మహిళలకు రుణాలు అందించడానికి చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలో మహిళలు రుణాలు తిరిగి చెల్లింపు 93 శాతం గా ఉందని ప్రైవేటు బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చే అవకాశం ఉందని డి సి సి బి బ్యాంకు పాడి రైతులకు వెంటనే అవసరమైన రుణాలను గుర్తించి అందించాలని సూచించారు. దేశంలోనే మన రాష్ట్రానికి నాణ్యతతో కూడిన మంచి పాలన అందించే రాష్ట్రంగా పేరు ఉందని అందుకు తగ్గ పాల ధర మనం పొందాల్సి ఉంటుందని అన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే జగనన్న పాలవెల్లువ పై అధికారులకు సిబ్బందికి పలుసార్లు శిక్షణ ఇచ్చామని అనుకున్న విధంగా మరో ఇరవై ఐదు రోజుల్లో వంద కేంద్రాల ద్వారా పాల సేకరణ చేపట్టడానికి సిద్ధమవుతోందని వివరించారు.
ఈ సమీక్షలో డి పీ వో రాజశేఖర్ రెడ్డి ,డి సి ఓ ఉమాదేవి, పి డి డి ఆర్ డి ఎ జ్యోతి, పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, డీసీసీబీ బ్యాంకు ప్రతినిధులు, కోపరేటివ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment