ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏపీసీఆర్డీఏ)
కమిషనర్ వారి కార్యాలయము, లెనిన్ సెంటర్, విజయవాడ (ప్రజా అమరావతి);
మంగళగిరి ఎంఐజీ జగనన్న టౌన్షిప్లో 267 ప్లాట్ల ఈ-వేలం
* సులభతర వాయిదా పద్ధతుల్లో చెల్లింపుల సౌలభ్యం
ఏపీసీఆర్డీఏ కమిషనర్ శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్.
మధ్య తరగతి ఆదాయ సమూహాలు(ఎంఐజీ) చక్కటి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకునే బృహత్తర ఆలోచనతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం మంగళగిరిలో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ను నెలకొల్పినట్లు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏపీసీఆర్డీఏ) కమిషనర్ శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆశాజనకమైన ధరలకే అందించటంతో పాటుగా సులభతర వాయిదా పద్ధతుల్లో ఈ-వేలం ద్వారా ప్లాట్లు కొనుగోలుచేసుకునే సౌలభ్యాన్ని కల్పించినట్లు కమిషనర్ వివరించారు. ఎంఐజీ లే అవుట్-2లో 200 చదరపు గజాల ప్లాట్లు- 68, 240 చదరపు గజాల ప్లాట్లు - 199 మొత్తంగా 267 సౌకర్యాలతో కూడిన నివాస ప్లాట్లు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. ఒక్కో చదరపు గజం ధర రూ.17,499గా నిర్ణయించినట్లు స్పష్టీకరించారు. సామాన్య ప్రజానీకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీతో ప్లాట్లను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. స్థానిక నియోజకవర్గంలో నివశిస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు లే అవుట్లోని 10 శాతం ప్లాట్లు రిజర్వుడు చేసి 20 శాతం రాయితీ కల్పించటం జరిగినది. అదేవిధంగా ఇదే నియోజకవర్గంలో నివశిస్తున్న విశ్రాంత ఉద్యోగులకు అయిదు శాతం ప్లాట్లను రిజర్వుడు చేయబడినట్లు వివరించారు.
సులభతర వాయిదా పద్ధతు లలో ఎంఐజీ ప్లాట్లు:
మధ్య తరగతి ప్రజలు ఎంఐజీ ప్లాట్లు కొనుగోలుచేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సులభతర వాయిదాల పద్ధతిని అందుబాటులోనికి తీసుకువచ్చింది. కొనుగోలుదారులు తమ వాయిదాలను ఈ విధంగా చెల్లింపులు చేసుకోవచ్చును.
* ఎంఐజీలో ప్లాటును బుక్చేసుకునే వారు ప్రారంభ చెల్లింపుగా నికర అమ్మకపు ధరపై 10 శాతం మొత్తాన్ని చెల్లించి ఎంపిక చేసుకున్న పరిమాణం గల ప్లాటును బుక్ చేసుకోవాలి.
* ఏపీసీఆర్డీఏకు వచ్చిన దరఖాస్తులను స్క్రూటినీ చేసి ఈ-లాటరీ నిర్వహించబడుతుంది.
* ఈ-లాటరీ నిర్వహించి ఎంపికకాబడిన లబ్ధిదారునికి 24 గంటల లోపు ఏపీసీఆర్డీఏ ప్లాటు కేటాయింపు పత్రాన్ని అందజేస్తుంది.
* ప్లాటు కేటాయింపు అయిన నెల లోపు ఒప్పంద క్రతువు పూర్తి చేసుకొని నికర అమ్మకపు ధరలో 30 శాతం సొమ్మును చెల్లించాలి.
* 180 రోజుల లోపు అమ్మకపు ధరపై మరో 30 శాతాన్ని చెల్లించాలి.
* 360 రోజుల లోపు అమ్మకపు ధరపై మరో 30 శాతం కలిపి మొత్తం ధరను చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఏడాది కాలంలో వాయిదాలు చెల్లించిన తరువాత ప్లాటుకు రిజిస్ట్రేషన్ పూర్తిచేసి కొనుగోలుదారుకు పత్రాలు అందిస్తారు.
40 శాతం అభివృద్ధి ధరపై రిజిస్ట్రేషన్ ఛార్జీలు మినహాయింపు:
ఎంఐజీలో ప్లాట్లు కొనుగోలు చేసుకునే వారికి ప్రభుత్వం మరో బృహత్తర అవకాశాన్ని కల్పిస్తోంది. నికర అమ్మకపు ధరలో 60 శాతం మీద మాత్రమే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెట్టుకోవాల్సి ఉంటుంది. తక్కిన 40 శాతం భూమి మీద రిజిస్ట్రేషన్ ఛార్జీలను మినహాయిస్తోంది.
* ఎంపిక కాబడిన లబ్ధిదారు అమ్మకపు ధర మొత్తాన్ని ఒకేసారి చెల్లించినచో వారికి 5 శాతం రాయితీని కల్పించి రిజిస్ట్రేషన్ క్రతువును పూర్తిచేసి ప్లాటును లబ్ధిదారుకు స్వాధీనపరచటం జరుగుతుంది.
* ఎంఐజీ లే అవుట్ ఏపీసీఆర్డీఏ ద్వారా పూర్తిస్థాయి అనుమతి పొందిన ప్రాజెక్టు.
ఏపీ రెరా ఆమోదం:
ఎంఐజీ లే అవుట్ మొత్తము ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులెటరీ అథారిటీ వారి వారిచే ఆమోదింపబడిన నెంబరు: P07120239995, DTCP ఆమోదం నెంబరు: LP03/2022/MIG/Gతో ఆమోదం పొందబడినంది.
సకలం అందుబాటులో ఉండే ప్రాంతం:
మంగళగిరిలోని ఎంఐజీ లే అవుటు ప్రజా జీవనానికి చక్కటి అనువైన ప్రాంతం. విద్యాలయాలు, ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు, క్రీడా ప్రాంగణాలు, బస్టాండు, రైల్వేస్టేషన్లకు కూడావేటు దూరంలో ఉన్నది.
1. ఎంఐజీకి 500 మీటర్ల దూరంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారి అమరావతి క్రికెట్ స్టేడియం.
2. మంగళగిరి బస్టాండు మూడు కిలో మీటర్లు.
3. మంగళగిరి రైల్వేస్టేషన్ మూడు కిలో మీటర్లు.
4. మంగళగిరి ప్రభుత్వాసుపత్రి మూడు కిలోమీటర్లు.
5. అమృత విశ్వవిద్యాలయము మూడు కిలోమీటర్లు.
6. ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయము నాలుగు కిలోమీటర్లు.
7. అఖిల భారత వైద్య విధాన పరిషత్(ఎయిమ్స్) అయిదు కిలోమీటర్లు, ఎన్ఆర్ఐ ఆసుపత్రి నాలుగు కిలోమీటర్లు.
8. ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయము ఏడు కిలోమీటర్లు.
9. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము తొమ్మిది కిలోమీటర్లు.
9. ఆంధ్రప్రదేశ్ సచివాలయము 10 కిలో మీటర్లు.
10. ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానము 15 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉన్నవి.
ఎంఐజీ లే అవుట్లో ప్రత్యేకతలు ఇవే:
1. 60 మరియు 80 అడుగుల వెడల్పు గల తారు రోడ్లతో ప్రధాన రవాణా వ్యవస్థ.
2. 40 అడుగుత వెడల్పుతో అంతర్గత రవాణా వ్యవస్థ.
3. పాదచారులకు ప్రత్యేకంగా నడకదారులు సౌకర్యం.
4. ప్రత్యేకించి మంచినీటి జలాశయాన్ని నిర్మాణం చేపట్టి తాగునీటి సరఫరా వ్యవస్థ నిర్మాణం.
5. లే అవుట్లో మురుగునీటి శుద్ధి కర్మాగారము.
6. జనాభాకు అనుగుణంగా విద్యుత్తు వినియోగ అవసరాలకు తగ్గట్టుగా అత్యధిక సామార్థ్యం గల విద్యుత్తు సరఫరా ఏర్పాటు.
7. వర్షపునీటి కాలవల నిర్మాణం.
8. కాంతులీనే వీధి దీపాల నిర్మాణ వ్యవస్థ.
9. ప్రజలు సాయం, సంధ్య వేళల్లో ఆహ్లాదంగా గడిపేందుకు హరిత ఉద్యానవనాలు, చక్కటి ల్యాండ్ స్కేప్ ఆవిష్కరణలతో ఎంఐజీ లే అవుట్లో అభివృద్ధి పనులను ఏపీసీఆర్డీఏ చేపడుతున్నది.
ఇతర వివరములు కొనుగోలు పోర్టల్ https://migapdtcp.ap.gov.in ఏపీ సీఆర్డీఏ https://crda.ap.gov.in నందు 19.10.2022 నుంచి అందుబాటులో ఉన్నాయి.
పది శాతం ప్రారంభ చెల్లింపు ధరతో 19.11.-2022 సాయంత్రం 5 గంటల లోపు సదరు దరఖాస్తులను సమర్పించవలెను. ఇతర సందేహాలకు: 0866 - 2527124 ఫోను నెంబరుకు సంప్రదించవచ్చు.
addComments
Post a Comment