శ్రీ దామోదరం సంజీవయ్య తాప విద్యుత్ కేంద్రము3వ యూనిట్ (1x800 మెగా వాట్స్) జాతికి అంకితం
.
• ఈ నెల 27వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జాతికి అంకితం కానున్న శ్రీ దామోదరం సంజీవయ్య తాప విద్యుత్ కేంద్రం మూడో యూనిట్.
• 800 మెగా వాట్ల యూనిట్ల సామర్ధ్యం తో నిర్మాణం.
• ఇప్పటికే రెండు 800 మెగా వాట్ల యూనిట్ల సామర్ధ్యంతో నిర్మాణాలు పూర్తి చేసుకొని విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్న శ్రీ దామోదర సంజీవయ్య తాప విద్యుత్ కేంద్రంలోని రెండు యూనిట్లు.
రాష్ట్రంలో విద్యుత్ కొరత తీరుస్తూ తద్వార, రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో నేలటూరు వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ ప్లాంట్లు నిర్మాణాలు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి కలలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం, నేలటూరు వద్ద ఇప్పటికే రెండు 800 మెగా వాట్ల యూనిట్ల నిర్మాణాలు పూర్తి చేసుకొని విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్న శ్రీ దామోదరం సంజీవయ్య తాప విద్యుత్ కేంద్రంలో మరో 800 మెగా వాట్ల యూనిట్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ నెల 27వ తేదీన జాతికి అంకితం కానున్నది. ఏపి జెన్ కో 50.45 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 4.83 శాతం, ఉమ్మడి రాష్ట్ర డిస్కంలు 44.72 శాతం మూలధనంతో ప్రత్యేకంగా నేలటూరు వద్ద 2009 సంవత్సరంలో మొదటి దశలో రెండు 800 మెగా వాట్ల యూనిట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో ప్రారంభించబడిన ఆంధ్రప్రదేశ్ పవర్ డెవెలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ సంస్థను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమ అంకిత భావంతో రాజనీతిజ్ఞతతో చేసిన సేవలకు గుర్తింపుగా శ్రీ దామోదరం సంజీవయ్య తాప విద్యుత్ కేంద్రంగా నామకరణం చేసినది.
సోమశిల, కండలేరు రెండు ప్రధాన జలాశయాలు కలిగి , కృష్ణపట్నం పోర్ట్, రామాయపట్నం పోర్టు, పవర్ ప్లాంట్స్ నిర్మాణాలతో సుదూర తీరప్రాంతం కలిగి ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న నెల్లూరు జిల్లా పటంలో శ్రీ దామోదరం సంజీవయ్య తాప విద్యుత్ కేంద్రం 3వ యూనిట్ ప్రారంభం మరో కలికితురాయిగా చేరనున్నది.
అతిపెద్ద కృష్ణపట్నం ఓడరేవుతో ప్రపంచ పటంలో ఎంతో గుర్తింపు పొందిన నెల్లూరు జిల్లా, కృష్ణపట్నం ఓడరేవుకు సమీపంలో మరో 800 మెగా వాట్ల యూనిట్ల నిర్మాణ సామర్ధ్యంతో శ్రీ దామోదరం సంజీవయ్య తాప విద్యుత్ కేంద్రం 3వ యూనిట్ పూర్తి కావడం జిల్లాకే గర్వకారణం. ఈ 3వ విద్యుత్ యూనిట్ నిర్మాణం వలన స్థానిక యువతకు రాబోయే రోజుల్లో పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. అలాగే రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు తీరడంతో పాటు పెద్ద ఎత్తున విద్యుత్ ఆధారిత పరిశ్రమల స్థాపనకు రాష్ట్రం వేదిక కానున్నది.
శ్రీ దామోదరం సంజీవయ్య తాప విద్యుత్ కేంద్రం మొదటి దశలో రెండు 800 మెగా వాట్ల యూనిట్లను 2009లో ప్రారంభించి, 2015లో వాణిజ్య ఉత్పత్తికి పూర్తి అయినది. ప్రస్తుతం రెండవ దశలో మరో 800 మెగా వాట్ల యూనిట్ యొక్క పనులు 2016 సంవత్సరంలో ప్రారంభించుకోబడి, పనులు పూర్తి చేసుకొని నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మూడవ యూనిట్ నిర్మాణాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఎపి జెన్ కో దాదాపు 1,170 ఎకరాల్లో ప్లాంట్లు నిర్మాణాన్ని చేపట్టింది.
శ్రీ దామోదరంసంజీవయ్య తాప విద్యుత్ కేంద్రం రెండవ దశ (1x800) ముఖ్యాంశాలు:
ముత్తుకూరు మండలం నేలటూరులో మొదటి దశలో 1,600 (2 X 800 మెగావాట్ల విద్యుత్ యూనిట్) మెగావాట్ల ప్రారంభ సామర్ద్యంతో ఉత్పత్తిని ప్రారంభించింది. మొదటి దశకు విస్తరణగా రెండవ దశలో 3వ యూనిట్ నిర్మాణ పనులు 2016 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ 3వ యూనిట్ నిర్మాణానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ. 5935.87 కోట్లు మరియు ఆంద్ర రాష్ట్ర విద్యుత్ ఆర్థిక సంఘం రూ. 1000 కోట్లు రుణం మంజూరు చేసింది. డెజిన్ సంస్థ వివరణాత్మకంగా డిజైన్ చేశారు. తదుపరి డిసిపిఎల్ వారు ప్రాజెక్టు నిర్మాణంలో సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. 3వ యూనిట్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి బాయిలర్, టర్బయిన్, జనరేటర్ సంబంధమైన పనులు బిహెచ్ఈఎల్ సంస్థకు అప్పగించారు. ఇతర పనులు, సివిల్ పనులు టాటా ప్రాజెక్టు లిమిటెడ్ వారికి అప్పగించారు. నూరు శాతం దేశీయ బొగ్గుతో బాయిలర్ నడుపబడుతుంది. రోజుకు 9.312 టన్నుల బొగ్గు 3వ యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించడం జరుగుతుంది. MoEF, రాష్ట్ర కాలుష్య నియంత్రణ విభాగాల నుండి అన్నీ పర్యావరణ అనుమతులు చట్టబద్ధంగా పొందడమైనది. మహనది బొగ్గు గనులతో సంవత్సరంనకు 3.548 మి.టన్నులు సరఫరా చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ విద్యుత్ యూనిట్ వలన అనేక ప్రయోజనాలు ఇమిడివున్నాయి. సూపర్, క్రిటికల్ రెండు పాసుల బాయిలర్ యూనిట్ ద్వారా ఎక్కువ సమర్ధత, తక్కువ కాలుష్యంతో నిర్వహించుట వలన తక్కువ ధరకు విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోగా, ప్రస్తుతం ఉన్న నాలుగు 400 కె.వి లైన్లు ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతుంది. రెండు దశలకు గాను మొత్తం 410 ఎకరాలలో గ్రీన్ బెల్ట్ నిర్మించారు.
* శ్రీ దామోదరం సంజీవయ్య తాప విద్యుత్ కేంద్రము రెండవ దశ (1x800 మెగా వాట్స్) విశిష్ట లక్షణాలు:*
కెపాసిటి మరియు యూనిట్ల సంఖ్య : 1x800 మెగా వాట్స్.
బాయిలర్ : సూపర్, క్రిటికల్, రెండు పాసుల బాయిలర్
బొగ్గు లభ్యత : మహనది బొగ్గు గనులు
నీటి లభ్యత : సముద్రపు నీరు(బంగాళాఖాతం)
చల్లబరచు విధానం : సహజ డ్రాఫ్ట్, కూలింగ్ టవర్
ఇ ఎస్.పి సమర్ధత : 99.936%
బూడిద రవాణా : తడి, పొడి విధానముల ద్వారా
పొడి బూడిద రవాణా : బూడిదను సైలో లలో నింపి, వినియోగదారుల కు పొడిగా రవాణా.
చిమ్నీ పొడవు : 275 మీటర్లు
మొత్తం ఉత్పత్తి: 5956 మిలియన్ సంవత్సరంనకు (85 % లభ్యతతో)
ఆక్సిలరీ పవర్: 5.75%
స్టేషన్ హీట్ రేటు : 2064 కి. క్యాలరీ/యూనిట్
addComments
Post a Comment