తాడేపల్లి (ప్రజా అమరావతి); దక్షిణ కొరియాలో సెప్టెంబర్ 14 నుంచి 21 వ తేదీ వరకు జరిగిన సాఫ్ట్ టెన్నిస్ కొరియా కప్ అంతర్జాతీయ టోర్నమెంట్ లో కె ఎల్ యూనివర్సిటీ విద్యార్థి ఎస్. వేహిత్ 3 వ స్థానం సాధించాడని యూనివర్సిటీ విద్యార్థి విభాగం డీన్ డాక్టర్ హనుమంతరావు తెలిపారు. యూనివర్సిటీలో బీసీఏ 2 వ సంవత్సరం చదువుతున్న వేహిత్ ప్రపంచ స్థాయిలో ప్రతిభ కనబరచి 3 వ స్థానంలో నిలవటం గర్వకారణ
మని అన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఉపాకులపతి డాక్టర్ సారధివర్మ, డీన్ డాక్టర్ హబీబుల్లా ఖాన్, అసోసియేట్ డీన్ డాక్టర్ హరిషోర్ తదితరులు వేహిత్ ను అభినందించారు.
addComments
Post a Comment