విజయవాడ (ప్రజా అమరావతి);
వరకట్న వేధింపుల మరణాల కేసులను విచారించే సమయంలో సంబంధితవరకట్న వేధింపుల సెక్షన్ 304-బి ఐపీసీ పరిధిలో ఉన్నప్పటికీ.. సెక్షన్ 302 ఐపీసీని ధృష్ఠిలో ఉంచుకుని విచారణ జరపవలసిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను పాటించాలని గౌరవ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ.వి. రవీంద్ర బాబు రాష్ట్రంలో అన్ని క్రిమినల్ కోర్టులకు హైకోర్టు రిజిస్ట్రీ ద్వారా ఆదేశాలివ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర డీజీపీ ద్వారా 304-బి ఐపీసీ కేసులను విచారణ జరుపు సంబంధిత పోలీస్ అధికారులకు ఉత్తర్వులు ఇవ్వవలసిందిగా కూడా ఆదేశాలివ్వడం జరిగింది.
ప్రాసిక్యూషన్ వారి కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా మంగళగిరి నివాసిశ్రీమతి భట్టు శ్రీ వర్ధిని కి విజయవాడకు చెందిన భట్టు శ్రీనివాసరావుతో 1996 లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కట్న కానుకలు, లాంఛనాలు భారీగానే సమర్పించారు. అనంతరం తరచుగా అదనపు కట్నం వేధింపులకు గురౌతున్నట్లు పుట్టింటి వారికి తెలియజేసింది. తదనంతరం తన భర్త వ్యసనాలకు గురై అదనపు కట్నం పుట్టింటి నుండి తీసుకురావాలని వేధింపులకు గురిచేస్తున్నాడని మరియు అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక శ్రీ వర్థిని తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తనను చంపే ప్రయత్నం చేస్తున్నారని తెలియజేసింది. అదే రోజు సాయంత్రం శ్రీ వర్ధిని తల్లి దామర్ల రేవతి దేవి (53) తమ కుమార్తె తీవ్ర కాలిన గాయాలతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లగా అక్కడ చనిపోయినట్లు తెలిపారు. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. కోర్టు విచారణలో ప్రాసిక్యూషన్ వారు సరైన సాక్ష్యాధారాలు సమర్పించక పోవడం వల్ల కేసు కొట్టి వేయడం జరిగింది. బాధితులకు ట్రయల్ కోర్టులో సరైన న్యాయం జరగలేదని మరియు నేరస్థులు ఎటువంటి శిక్షకు గురికాకుండా తప్పించుకున్నారని భావించి హైకోర్టుకు అప్పీల్ కు వెళ్లారు. హైకోర్టు వారు కేసు పూర్వపరాలను పరిశీలించి సంబంధించిత కేసును సెక్షన్ 304-బి ఐపీసీ పరిధిలో కాకుండా సెక్షన్ 302 ధృష్టిలో ఉంచుకొని విచారణ జరపవలసిందిగా 5వ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జిగుంటూరు వారిని నాలుగు నెలల లోపు కేసును పునర్విచారణ జరిపి పూర్తి చేయవలసిందిగా తీర్పును ఇవ్వడం జరిగింది.
addComments
Post a Comment