రోటరీ క్లబ్ అఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో 5 కె రన్

 తాడేపల్లి (ప్రజా అమరావతి);


*రోటరీ క్లబ్ అఫ్ తాడేపల్లి  ఆధ్వర్యంలో 5 కె రన్



 *పోలియో నిర్మూలన బాధ్యత అందరిపై ఉంది*


*పోలియో రహిత ప్రపంచమే రోటరీ ధ్యేయం*  


 *రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షులు మున్నంగి వివేకానంద రెడ్డి*


*రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో 5  కి.మీ. పోలియో అవగాహన ర్యాలీ..*


ప్రపంచ వ్యాప్తంగా పోలియో నిర్మూలనకు రోటరీ విశేష కృషి చేస్తునట్లు అధ్యక్షులు మున్నంగి వివేకానందరెడ్డి తెలియచేశారు. అంతర్జాతీయ పోలియో నివారణ కార్యక్రమములలో భాగంగా రోటరీ క్లబ్ అఫ్ తాడేపల్లి అధ్యక్షులు మున్నంగి వివేకానంద రెడ్డి ఆధ్వర్యంలో  శనివారం తాడేపల్లి సాయిబాబా గుడి వద్ద నుండి ప్రకాశం బ్యారేజి వరకు 5 కి.మీ.

5 కె రన్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా

తాడేపల్లి తహసీల్దార్ వాకా శ్రీనివాసులరెడ్డి పాల్గొని జండా ఊపి

5 కె రన్ ను ప్రారంభించారు.ఈ సందర్బంగా రొటరీ క్లబ్ అఫ్ తాడేపల్లి అధ్యక్షులు మున్నంగి  వివేకానంద రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో పోలియో పూర్తిగా నివారించబడినదని, కానీ అమెరికా దేశంలోపోలియో వైరస్ కనపడటం వలన రోటరీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరల పోలియో నిర్మూలనా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని,అన్నారు. గేట్స్ & మెలిండా ఫౌండేషన్, రోటరీ సంస్థలు సమిష్టిగా కృషి చేస్తున్నాయని

అన్నారు.పోలియో రహిత ప్రపంచ మే ధ్యేయంగా 35 సంవత్సరాల నుండి రోటరీ ఇంటర్నేషనల్‌ చేస్తున్న కృషి అనిర్వచనీయమైందని అన్నారు. అందరం కలిస్తే పోలియో రహిత సమాజాన్ని నిర్మించవచ్చని అన్నారు.తాడేపల్లి తహసీల్దార్ శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ

తల్లీ బిడ్డల ఆరోగ్యం, వారి భవిష్యత్‌ పోలియో నిర్ములించటం పై వుందన్నారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగాలన్నారు.

పోలియో చుక్కలు మందు, పోలియో నిర్మూలన కోసం నిధులను సమకూర్చవలసిన భాద్యత మనపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో కె.యల్‌. యూనివర్సిటీ యన్.సి.సి, యన్‌.యస్.యస్ విద్యార్థినీ, విద్యార్థులు, రోటరాక్టు సభ్యులు . రోటరీ జిల్లా పోలియో నిర్మూలనా విభాగ భాధ్యులు సరిపుడి అనిల్‌, 

ఆంధ్ర ప్రాంత రోటరీ ప్రజా బాహుళ్య విభాగ అధ్యక్షులు యలమంచిలి వేణుగోపాల్, రోటరీ కార్యదర్శి కాట్రగడ్డ శివన్నారాయణ,రామకృష్ణ శెట్టి, పరుచూరి కిరణ్, కేశవరావు శెట్టి, రవీంద్రరెడ్డి, జంగాల వెంకటేష్, ఓబులరెడ్డి,రవీంద్రా రెడ్డి, రమేష్, మనోజ్,రాజేష్,శ్రీనివాసరావు,చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Comments