అనంతపురం (ప్రజా అమరావతి):
అనంతపురం జిల్లాలోని నాటు సారా రహిత గ్రామాల్లోని ( హరిత గ్రామాలు)ప్రజలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన పథకం కింద రూ. 58.47 లక్షల మెగా చెక్కును అందజేసిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, IAS
గారు, జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ IAS గారు
స్థానిక కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో ఈరోజు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి హరిత గ్రామాల్లోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ , ఎస్పీలు విజ్ఞప్తి చేశారు
నాటు సారా జోలికెళ్లకుండా ఉండేలా ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు జిల్లా పోలీస్, సెబ్ అధికారులు మరియు ఇతర ప్రభుత్వ యంత్రాంగంతో కలసి పరివర్తన-2 కార్యక్రమాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 15 నుండీ జూలై15 వరకు నాటు సారా ప్రభావిత ప్రాంతాల్లో దాడులు, అవగాహన సదస్సులు నిర్వహించారు
తత్ఫలితంగా జిల్లాలోని 28 గ్రామాల్లో నాటు సారా ప్రభావం లేకుండా హరిత గ్రామాలుగా రూపు దిద్దుకున్నాయి
సెబ్ విభాగం ఆధ్వర్యంలో 41 గ్రామాలలో సర్వే చేసి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కోసం ప్రతిపాదనలు పంపిన 264 మందిలో 14 మండలాలకు చెందిన 141 మందిని అర్హులుగా గుర్తించి తొలి విడతలో భాగంగా ఈ మెగా చెక్కును అందజేశారు
వ్యవసాయం, గేదెలు, ఆవులు, గొర్రెలు పెంపకం, కూరగాయలు, పండ్ల వ్యాపారం... ఇలా 11 విభాగాల్లో ఉపాధి అవకాశం పొందేలా ఈ ఆర్థిక సాయం అందించారు
ఆత్మకూరు, బెళుగుప్ప, గుత్తి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, కంబదూరు, పామిడి, శింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు మండలాలకు చెందిన 99 మంది పురుషులు, 42 మంది మహిళలు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన పథకం కింద లబ్ధి పొందారు.
రెండవ విడతలో మిగితా అర్హులైన లబ్ధిదారులకు స్కిల్ డెవలప్మెంట్ కింద ఆర్థిక సాయం అందించనున్నారు
పాత అలవాట్లు, పాత జీవనానికి స్వస్తి చెప్పి ప్రభుత్వం అందజేస్తున్న ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కలెక్టర్ , ఎస్పీ లు కోరారు.
ఈకార్యక్రమంలో సెబ్ అదనపు ఎస్పీ జె.రాంమోహనరావు, డిఆర్డీఏ పి.డి నరసింహారెడ్డి, లీడ్ బ్యాంకు మేనేజర్ నాగరాజరెడ్డి, సెబ్ అధికారులు, ఏపిఎంలు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment