పుట్టపర్తి, అక్టోబర్ 20 (ప్రజా అమరావతి):
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 9 శాఖలలో ఉన్న ఉద్యోగాలకు గాను 3 నోటిఫికేషన్ (నోటిఫికేషన్ నెంబర్ 12/2021,16/2021 మరుయు 19/2021) ద్వార నియామకం కొరకు ఆన్లైన్ ద్వార పరీక్షా 21.10.2022 ఉదయం 9.30 నుండి 12.00 వరుకు సంస్కృతి స్కూల్ అఫ్ ఇంజనీరింగ్, సత్యసాయి సూపర్ హాస్పిటల్ వెనుక, బీడుపల్లి రోడ్, ప్రశాంతి నిలయం నందు జరపబడును.
అభ్యర్థులు పరీక్షా కేంద్రాలలోకి ఉదయం 08.00 నుండి 09.00 వరకు మాత్రమే అనుమతించబడతారు. అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను, ఏ.పి.పి.ఎస్.సి కమీషన్ వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకొనవలెను. అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లతో పాటు, తప్పనిసరిగా ఫోటో ఐడెంటిటి కార్డు/పాస్ పోర్టు/పాన్ కార్డు/ఓటర్ ఐ.డి./ఆధార్ కార్డు/ఎంప్లాయీ ఐ.డి./డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు, తమకు కేటాయించిన పరీక్షా కేంద్రం వద్ద హాజరుకావలెను. మొబైల్ ఫోన్ లు మరుయు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రానికి అనుమతించపడదు. కావున అభ్యర్థులందరూ నిర్ణీత సమయము కంటే ముందే పరీక్షా కేంద్రం వద్దకు చేరుకుని సిబ్బందితో సహకరించవలసినదిగా జిల్లా కలెక్టరు, శ్రీ సత్యసాయి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు
addComments
Post a Comment