గంజాయి సరఫరాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలి : చంద్రబాబు

 *గంజాయి సరఫరాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలి : చంద్రబాబు*



గుంటూరు (ప్రజా అమరావతి) : గంజాయి సరఫరాను అరికట్టేలా రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని టీడీపీ  అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. పాఠశాల విద్యార్థుల వరకు గంజాయి వచ్చేసిందంటే బాధగా ఉందని  ఆవేదన వ్యక్తం చేశారు. దీనిద్వారా పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు.  రాజకీయ వేధింపులకు పోలీసులను వాడడం ఈ ప్రభుత్వానికి అలవాటైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను పట్టించుకోకుండా గాలికొదిలేయడం క్షమించరాని నేరమని ఆక్షేపించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

Comments