శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి

       తిరుమల  1.  అక్టోబరు  (ప్రజా అమరావతి);


   శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి 



      సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ యు యు లలిత్  శనివారం సాయంత్రం సతీ సమేతంగా తిరుమల శ్రీ  వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు 

        ఆలయం ఎదుట టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఈవో  శ్రీ ఎవి ధర్మారెడ్డి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి స్వాగతం పలికారు  ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం వారు స్వామివారిని దర్శించుకున్నారు 

      ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి కె మిశ్రా కూడా వీరితో పాటు స్వామి వారిని దర్శించుకున్నారు 


Comments