అమరావతి (ప్రజా అమరావతి);
- సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష
- ప్రభుత్వ కార్యక్రమాలకు సిమెంట్ సరఫరాలో అలసత్వం వద్దు
- సిమెంట్ కొరత వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడటం సరికాదు
- నాడు-నేడు, గృహనిర్మాణం, రహదారులు, ప్రాజెక్ట్ లకు ప్రాధాన్యత ఇవ్వాలి
- సిమెంట్ కంపెనీల సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దం
: మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ లకు, ప్రభుత్వ పథకాలకు అవసరమైన సిమెంట్ ను అందించడంలో అలసత్వం ప్రదర్శించవద్దని రాష్ట్ర గనులు, ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్రసాంకేతిక శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిమెంట్ కంపెనీల ప్రతినిధులకు విజ్క్షప్తి చేశారు. సచివాలయంలోని మూడోబ్లాక్ లో శుక్రవారం సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...
ప్రభుత్వం నాడు-నేడు, గృహనిర్మాణం వంటి కార్యక్రమాలను ప్రజల కోసం చేపడుతోంది. వీటికి అవసరమైన సిమెంట్ ను అందించాల్సిన బాధ్యత సిమెంట్ కంపెనీలకు ఉంది. ఇందుకోసం సామర్థ్యంను బట్టి ఆయా కంపెనీలకు ప్రభుత్వం ఇండెంట్ లనుఇచ్చింది. అయితే కొన్ని కంపెనీలు సిమెంట్ సప్లయిలో అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా ఇవ్వడం లేదు. రహదారుల నిర్మాణం, ఇరిగేషన్ ప్రాజెక్ట్ లకు ముందుగానే డబ్బు చెల్లించినా కూడా సిమెంట్ ను సకాలంలో అందించడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీనివల్ల ప్రాజెక్ట్ లు ముందుకు సాగడం లేదు. అదే విధంగా వివిధ కార్యక్రమాలకు సంబంధించి సిమెంట్ ఇండెంట్ లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులను కూడా జాప్యం లేకుండా ఇచ్చేందుకు సిద్దంగా ఉంది. సిమెంట్ కంపెనీలకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకువస్తే, వాటిని తక్షణం పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. ఇండెంట్ కు వెంటనే స్పందించి సిమెంట్ సరఫరా చేయాలని కోరుతున్నాం.
ఈ సమావేశంలో మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, డిఎంజి విజి వెంకటరెడ్డి, పలువురు సిమెంట్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
addComments
Post a Comment