శాశ్వత/ కాంట్రాక్టు ప్రాతిపదికన స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల నియామకానికి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు..




విజయవాడ (ప్రజా అమరావతి);


*శాశ్వత/ కాంట్రాక్టు ప్రాతిపదికన స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల నియామకానికి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు*..


*ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏ ఒక్క పోస్టూ ఖాళీగా ఉండకూడదన్న తపనతో జగనన్న ప్రభుత్వం వేస్తున్న మరో ముందడుగు*..


*డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ లో 400కు పైగా ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్*


*అక్టోబర్ 19,20,21వ తేదీల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు*


*వైద్యశాఖలో ఇప్పటికే 40,676 పోస్టుల్లో వైద్య సిబ్బంది నియామకం*


*పేదవాడికి కూడా ఆధునిక వైద్యం అందించాలని సీఎం చేపట్టిన మహా యజ్ఞంలో భాగస్వాములవ్వాలని ప్రభుత్వం పిలుపు*


         ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏ ఒక్క పోస్టూ ఖాళీగా ఉండకూడదన్న తపనతో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ లో శాశ్వత, కాంట్రాక్టు ప్రాతిపదికన 400కు పైగా స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల నియామకానికి వాక్-ఇన్ ఇంటర్వ్యూలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడలోని హనుమాన్ పేట పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో అక్టోబర్ 19,20,21వ తేదీల్లో వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించే పోస్టుల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్ట్ డాక్టర్ కు నెలకు జీతం రూ.1,30,000, గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్ట్ డాక్టర్ కు రూ.1,60,000, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ కు రూ 1,60,000 నిర్ణయించడం జరిగింది. శాశ్వత ప్రాతిపదికన నియమించే పోస్ట్ లకు అమల్లో ఉన్న ప్రభుత్వ స్కేల్ ప్రకారం జీతాలు చెల్లిస్తుందని పేర్కొంది. అనుభవం మరియు రిమోట్ ఏరియాను బట్టి అదన ప్రోత్సాహకాలకు అవకాశం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆయా పోస్టులకు అర్హులైన వారికి గరిష్ట వయోపరిమితి 70 ఏళ్లుగా నిర్ణయిస్తూ ప్రకటన జారీ చేసింది. పూర్తి వివరాలకు dme.ap.nic.in వెబ్ సైట్ ను సందర్శించాలని పేర్కొంది. సందేహాలకు డీఎంఈ  రిక్రూట్ మెంట్ హెల్ప్ లైన్ 07995055087, ఏపీవీవీపీ రిక్రూట్ మెంట్ హెల్ప్ లైన్ 06301138782 ను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని ఆ ప్రకటనలో తెలిపింది. 


                గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన పోస్టులతో కలిపి ఇప్పటికే 40,676 పోస్టుల్లో వైద్య సిబ్బంది నియమించిన ప్రభుత్వం తాజాగా అక్కడక్కడ మిగిలిపోయిన కొన్ని ఖాళీల భర్తీకి కూడా వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఈ మూడేళ్ల నాలుగు నెలల్లో స్పెషలిస్ట్ కేటగిరి క్రింద 2,797 పోస్టులు, మెడికల్ ఆఫీసర్లు 929,  స్టాఫ్ నర్సులు 4,894,  ఎమ్ ఎల్ హెచ్ పి లు 8,351, ఎ ఎన్ ఎమ్ లు 13,154, పారా మెడికల్ సిబ్బంది 7,005, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 249, క్లాస్-4 ఉద్యోగులు 3,297 మంది వైద్య సిబ్బందిని నియమించిన ప్రభుత్వం ప్రస్తుతం డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో బ్రాడ్ స్పెషాలిటీస్ పోస్టుల్లో భాగంగా రేడియాలజీ విభాగంలో 17, ఎమర్జెన్సీ మెడిసిన్ లో 16, ఫోరెన్సిక్ మెడిసిన్ లో 13, పాథాలజీలో 13 పోస్టులకు, సూపర్ స్పెషాలిటీ పోస్టుల్లో భాగంగా కార్డియాలజీ విభాగంలో 12, యూరాలజీలో 9, న్యూరో సర్జరీలో 08, పీడియాట్రిక్ సర్జరీలో 4 పోస్టులకు, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ పరిధిలో జనరల్ మెడిసిన్ విభాగంలో 34, రేడియాలజీ 24, జనరల్ సర్జరీ 13, పీడియాట్రిక్స్ విభాగంలో 9 పోస్టులకు అర్హులైన వారిని వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి ఆహ్వానిస్తోంది. 


          పేదవాడికి కూడా నాణ్యమైన ఆధునిక వైద్యం అందించే లక్ష్యంతో “నాడు నేడు” ద్వారా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం, ఇప్పటికే ఉన్న 11 మెడికల్ కాలేజీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, డా. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ సేవల విస్తరణ, డా.వైఎస్సార్ ఆరోగ్య ఆసరా. 104/108 సేవల విస్తరణ, వైఎస్సార్ విలేజ్/అర్బన్ హెల్త్ క్లినిక్ ల ఏర్పాటు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వంటి విప్లవాత్మక కార్యక్రమాలను అమలు చేస్తోంది ప్రభుత్వం. పేదవాడికి కూడా ఆధునిక వైద్యం అందించాలని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మహా యజ్ఞం లో భాగస్వాములమౌదాం రండి అని ఈ సందర్భంగా ప్రభుత్వం పిలుపునిచ్చింది. 



Comments