తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు, తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకుంటాం...
ఏపీ సచివాలయం (ప్రజా అమరావతి);


*తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు, తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకుంటాం...*


*సాంస్కృతిక కళాకారులకు పోటీలు..*


రాష్ట్రస్థాయిలో గెలుపొందిన కళాబృందాలకు బహుమతులు మరియు పారితోషకాలు...


...మంత్రి.... ఆర్కే రోజా.తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు- తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుట కొరకు, కళలను మరియు కళాకారుల అభివృద్దిని ఆకాంక్షిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కళాకారులకు మరియు కళా బృందాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి , భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహింపబడుతున్నాయని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి రోజా తెలిపారు.


పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రజత్ భార్గవ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్‌పర్సన్ శ్రీమతి వంగపండు ఉష, మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి ఆకాడమీల చైర్మన్/ చైర్‌పర్సన్ల పర్యవేక్షణలో సాంప్రదాయ,  జానపద మరియు గిరిజన నృత్యరీతుల కళాకారులకు మరియు గాత్ర (సింగింగ్) పోటీలు నిర్వహింపబడతాయి.  


పోటీలలో పాల్గొనదలచిన కళాకారులు పేరు/Artiste Name, కళారూపం/Art Form, చిరునామా/Address,జిల్లా/Districts,జోన్/Zone, ల్యాండ్ లైన్/ Land line, మొబైల్ నెంబర్/Mobile Number, ఈమెయిల్/E-mail, ఆధార్ నెంబరు/Aadhar Number, విద్యార్హత/Educational Qualification, ప్రస్తుత వృత్తి/Present Occupation,సాంప్రదాయ కళారూపం/ Traditional Art Form, శిక్షణ పొందిన కళాకారుడు/ Trained Artiste,అనుభవం సంవత్సరాలలో/ Years of Experience, ఇతర వివరములు  (పురస్కారాలు, సాధించిన విజయాలు మొ...) , Other Information If Any ఈ వివరాలతో కూడిన దరఖాస్తులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి, భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయం, ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, 2వ అంతస్థు, దుర్గాపురం, విజయవాడ – 520003 లేదా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలు/ పాఠశాలల (విజయనగరం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు మరియు కర్నూలు) నందు దరఖాస్తును పొంది పూర్తిచేసిన దరఖాస్తును అక్కడే సమర్పించవచ్చు లేదా పూర్తిచేసిన దరఖాస్తును apculturalcompetitions@gmail.com మెయిల్ ద్వారా లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి వెబ్ సైటులో (https://culture.ap.gov.in/) దరఖాస్తును పూర్తిచేయడం ద్వారా కూడా నవంబర్ 10, 2022 తేది లోపల సమర్పించాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు.


మరింత సమాచారం కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి కార్యాలయం వారిని చరవాణి 0866-2434380/390 ద్వారా సంప్రదించాలని... కళాకారులకు తెలిపారు.


దరఖాస్తు చేసుకున్న కళాకారులకు తిరుపతిలో (నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైయస్ఆర్ కడప, సత్యసాయి, అనంతపురము, నంద్యాల, కర్నూలు జిల్లాల కళాకారులకు) నవంబర్ 19,20,21 తేదిలలో మహతి కళాక్షేత్రం నందు, గుంటూరులో(ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, యన్.టి.ఆర్, కృష్ణ జిల్లాల కళాకారులకు) నవంబర్ 24,25,26 తేదిలలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో, రాజమహేంద్రవరంలో(ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల కళాకారులకు) నవంబర్ 29, 30, డిసెంబర్ 1 తేదిలలో శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో అలాగే విశాఖపట్నంలో(అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరిసీతారామరాజు, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కళాకారులకు), డిసెంబర్ 7, 8, 9 తేదిలలో వుడా చిల్డ్రన్స్ థియేటర్లో ఆడిషన్స్ నిర్వహింపబడతాయన్నారు.


 గెలుపొందిన కళాకారులు విజయవాడలో డిసెంబర్ 19,20 తేదిలలో నిర్వహింపబడే రాష్ట్రస్థాయి పోటిలలో పాల్గొంటారు. రాష్ట్రస్థాయిలో గెలుపొందిన కళాబృందాలకు బహుమతులు మరియు పారితోషకాలు అందజేయబడతాయని మంత్రి రోజా తెలిపారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
Shiv Nadar University Chennai inaugurated its flagship Quiz Competition - QUBIZ
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image