రాజరాజేశ్వరిదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్న .. ఆర్.కె. రోజా
విజయవాడ ఇంద్రకీలాద్రి : అక్టోబర్, 5 (ప్రజా అమరావతి);
శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం 10వ రోజు కనకదుర్గమ్మ అమ్మవారు రాజరాజేశ్వరిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని టూరిజం, సాంస్కృతిక, యువజనశాఖ మంత్రి ఆర్.కె. రోజా దర్శించుకున్నారు. దుర్గమ్మ దర్శనం ఆలయ ఈవో డి. భ్రమరాంబ ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం అనంతరం చిత్రపటాన్ని అందజేశారు. వేదపండితుల ఆశీర్వాదంతో అమ్మవారి దర్శనం గావించారు. మహిషాసురుని మర్దన అనంతరం బుధవారం రాజరాజేశ్వరిదేవి అలంకారంలో అమ్మ మనస్సుతోశాంత రూపంలో భక్తులను ఆశీర్వదిస్తోంది. ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖసంతోషాలతో జీవించాలనే అమ్మ ఆశీస్సులు అందిస్తోంది.
అనంతరం మీడియా వేదికపై మాట్లాడుతూ ముందుగా భక్తులకు శుభాకాంక్షలు. అందజేశారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారు 9 రోజులు 9 అవతరాలలో దర్శనం ఇచ్చి కనువిందు చేసిన అమ్మ 10 రోజున రాజరాజేశ్వరిదేవిగా దర్శన మిచ్చి భక్తులను విజయదశమి రోజున అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషముగా ఉందన్నారు. పరిపాలన వికేంద్రీకరణ జరిగి మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని 108 టెంకాయలు అమ్మవారికి సమర్పించడం జరిగినది. కోరిక నెరవేరిన తరువాత మరల వచ్చి మొక్కు తీర్చుకుంటా మన్నారు.
addComments
Post a Comment