ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో నివసించే గిరిజనులు దళారుల ప్రలోభాలకు గురై గంజాయి అక్రమ సాగు చేపట్టడం జరుగుతోంది



హర్యానా - సూరజ్ కుండ్ (ప్రజా అమరావతి);


హర్యానా లోని సూరజ్ కుండ్ లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన చింతన్ శిబిర్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత  హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో దేశంలోని వివిధ రాష్ట్రాల హోంమంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, డీజీపీ లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సైబర్ క్రైమ్, ఉమెన్ సేప్టీ, కోస్టల్ సెక్యూరిటీ, గంజాయి మరియు డ్రగ్ కంట్రోల్, శాంతి భద్రతలు వంటి అంశాలపై చర్చ జరిగింది. చివరి రోజు గంజాయి నియంత్రణ అనే అంశంపై ఆంద్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.


ఈ సందర్భంగా హోం మినిస్టర్ తానేటి వనిత  మాట్లాడుతూ..


ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో నివసించే గిరిజనులు దళారుల ప్రలోభాలకు గురై గంజాయి అక్రమ సాగు చేపట్టడం జరుగుతోంద


న్నారు. 


ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గంజాయి అక్రమ సాగు పై ఉక్కుపాదం మోపేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు హోంమంత్రి పేర్కొన్నారు. 


ఆపరేషన్ పరివర్తన్ లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 10 మండలాల 313 గ్రామాలలో 7,552 ఎకరాల విస్తీర్ణంలోని 9,251 కోట్ల రూపాయల విలువైన గంజాయి సాగును ధ్వంసం చేశామన్నారు. 


గంజాయి అక్రమ సాగు నిరోధం, ధ్వంసంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచిందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నివేదిక పేర్కొన్న విషయాన్ని హోంమంత్రి గుర్తుచేశారు. 


దేశంలో ధ్వంసం చేయబడిన గంజా సాగు 27,510 ఎకరాలలో 40% అనగా 11,550 ఎకరాల గంజా సాగు ధ్వంసం ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే చేసినట్లు తెలిపారు. 


రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టడానికి ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాదాపు 2 లక్షల కేజీల గంజాను ధ్వంసం చేసినట్లు హోంమంత్రి తానేటి వనిత  పేర్కొన్నారు.

Comments