అభివృద్ది, సంక్షేమమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నది

 

నెల్లూరు (ప్రజా అమరావతి);

అభివృద్ది, సంక్షేమమే లక్ష్యంతో  రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నద


ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 


బుధవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని టి.పి.గూడూరు మండలం,  తోటపల్లి పంచాయతీ పరిధిలోని  దక్కిలివారిపాలెం  గ్రామంలో  గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి, ప్రతి గడపకు వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుని,  ప్రభుత్వం నుంచి వారికి అందిన సంక్షేమ పథకాలను వివరించి, సంబంధిత వివరాలతో కూడిన బుక్ లెట్ ను అందచేశారు. 


ఈ సందర్భంగా మంత్రి శ్రీ గోవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ,  అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను సంతృప్తికర స్థాయిలో అందించడమే గడపగడపకు మన ప్రభుత్వం  కార్యక్రమ ప్రధాన  ఉద్దేశమన్నారు.  గడపగడపకు మన ప్రభుత్వం  కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటించు సంధర్భంలో  ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సచివాలయం నకు 20 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు. సర్వేపల్లి నియోజక వర్గ పరిధిలోని అన్నీ గ్రామాల్లో  సిమెంటు రోడ్లను వేయడం జరిగిదని,  గ్రామాల్లో అవసరం మేరకు సైడు మురుగు కాలువల నిర్మాణాలకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.  తోటపల్లి పంచాయతీ పరిధిలో 3 కోట్ల 20 లక్షల రూపాయాలతో  వివిధ అభివృద్ది కార్యక్రమాలను  చేపట్టడం జరిగిందని మంత్రి తెలిపారు.  ఈ మూడు సంవత్సరాల కాలం లో  ప్రతి కుటుంబానికి  వివిధ  సంక్షేమ కార్యక్రమాల ద్వారా సరాసరి 5 లక్షల రూపాయల వరకు లబ్ధిచేకూరిందన్నారు. ఈ గ్రామంలో  తలారి లక్ష్మమ్మ, కామేశ్వరమ్మ, ఈదా శీనయ్య  తదితర లబ్ధిదారులకు వివిధ పధకాల కింద  5 లక్షల రూపాయల పైబడి లబ్ధిచేకూరిందన్నారు.  పేద వర్గాల అభ్యున్నతికి  రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సందర్భంగా ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు వారు సంక్షేమ  పథకాల అమలు పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని మంత్రి అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో  హేమలత, గ్రామ సర్పంచ్  దానా స్వాతి, మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.


Comments