గ్రామాల్లో దేవాలయాల అభివృద్ధికి కృషి



నెల్లూరు, అక్టోబర్ 28 (ప్రజా అమరావతి): గ్రామాల్లో  దేవాలయాల అభివృద్ధికి కృషి


చేస్తున్నామని  రాష్ట్ర వ్యవసాయ, సహకార, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 

 శుక్రవారం ఉదయం పొదలకూరు మండల పరిధిలోని తాటిపర్తి పంచాయతీ వరదాపురంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ నిర్మాణానికి మంత్రి శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామాలకు సంబంధించి అభివృద్ధి పనులతో పాటు, అవసరమైన చోట దేవాలయాలను కూడా పెద్ద ఎత్తున నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.  ఏ గ్రామాల్లో ఆలయాలను ప్రజలు కోరుకుంటారో అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ నిధులతో  సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన ఆలయాల నిర్మాణానికి  శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్న సర్వేపల్లి  నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏడు దేవాలయాలను టిటిడి సహకారంతో మంజూరు చేయించామని, ఇంకా అవసరమైన చోట ఆలయాలను మంజూరు చేయించేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే మరమ్మత్తులకు గురైన ఆలయాల్లో కూడా ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. గ్రామాలకు సంబంధించి సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, సాగు, తాగునీటి అవసరాలతో పాటు దేవాలయాల నిర్మాణానికి కూడా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. 

 ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


Comments