రామచంద్రపురం (ప్రజా అమరావతి);
**ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలి:- రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ చెల్లు బోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ*
మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గo రామచంద్రపురం పట్టణంలో ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు ఆసుపత్రికి కావలసిన అభివృద్ధి పనులను ఆయన పర్యవేక్షించారు ఈ సమావేశంలో కొన్ని ప్రతిపాదనలు అభివృద్ధి కమిటీ ఆమోదించడం జరిగిందని ముఖ్యంగా ఈ ఆసుపత్రిలో *సిటీ స్కాన్,* *డయాలసిస్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ ,* అదేవిధంగా ఆసుపత్రి పక్కనే *R&B శాఖకు,* సంబంధించిన స్థలంలో రోగుల అవసరాల కొరకు అదనపు గదులను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ముఖ్యమంత్రివర్యులకు పంపించడం జరుగుతుందని మంత్రి అన్నారు. అంతేకాకుండా ముఖ్యముగా ఆసుపత్రిలో డాక్టర్లు కొరత ఉన్నందున త్వరలో డాక్టర్ల నియామకం కూడా చేపడతామని ఆయన అన్నారు. రోగుల అవసరాల కొరకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నామని ఇప్పటికే ఆసుపత్రి పైన అదనపు గదులు నిర్మించడం జరుగుతుందని ఈ పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు. తోగరం మూర్తి, వాసంశెట్టి లావణ్య, చెల్లిబోయిన ప్రకాష్ ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ బి. వీరభద్రుడు, సీనియర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment