ఇంద్రకీలాద్రి: అక్టోబర్ 3 (ప్రజా అమరావతి);
శరన్నవరాత్రి మహోత్సవాలలో తొమ్మిదవ రోజు మంగళవారం శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ మహిషాసుర మర్థనీ దేవిగా దర్శనమిస్తారు.
అష్టభుజాలతో అవతరించి సింహవాహినియై, దుష్టుడైన మహిషాసురుడిని సంహరించి శ్రీదుర్గాదేవి దేవతల, ఋషుల, మానవుల కష్టాలను తొలగించింది. మహిషాసురమర్దనీ దేవి అలంకారములో ఉన్న శ్రీ అమ్మవారిని దర్శించడం వలన అరిష్ఠవర్గాలు నశిస్తాయి. స్వాతికభావం ఉదయిస్తుంది. సర్వదోషాలు పటాపంచలు ఆవుతాయి. ధైర్య, స్తైర్య, విజయాలు చేకూరుతాయి.
addComments
Post a Comment